Tarak: రామ్ చరణ్ కూతురికి తారక్ పంపిన గిఫ్ట్ ఇదే.. అసలేమైందంటే?

Tarak: టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలు అయిన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ల గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి హీరోలు మధ్య స్నేహం గురించి కూడా మనందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలు ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా కూడా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందు నుంచే విరిద్దరి మధ్య స్నేహబంధం ఉంది. అలాగే ఈ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య స్నేహబంధం మరింత బలపడింది. వీరిద్దరిలో ఎవరిదైనా పుట్టినరోజు వస్తే ఇంట్లో వాళ్ల కళ్లు గప్పి మరి బయటికి చెక్కేస్తామని స్వయంగా చెర్రీ, తారక్ లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

చరణ్‌ తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడానికి ముందే మొదట ఎన్టీఆర్‌కి ఫోన్‌ చేసి తన ఆనందాన్ని షేర్‌ చేసుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెర్రీ తెలిపాడు. అంతలా వారి మధ్య స్నేహం ఉంది కాబట్టే జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమా చేయగలిగాడని చెప్పవచ్చు. రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులకు పెళ్లైన 10ఏళ్ల తర్వాత వారు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు ఫ్యాన్స్‌ కూడా సంతోషంలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా మెగా ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే ఆ పాపకు క్లీంకార అని పేరు కూడా పెట్టారు. మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన కుటుంబం నుంచి కూడా చెర్రీ దంపతుల గారాల పట్టీకి బహుమతులు భారీగానే అందాయి.

 

అందులో భాగంగగానే ఎన్టీఆర్‌ కూడా క్లీంకార కోసం ప్రత్యేకమైన కానుకను పంపించినట్లు తెలుస్తోంది.

గిఫ్ట్‌ కూడా తారక్‌ పిల్లలు అభయ్‌, భార్గవ్‌ రామ్‌లు ఎంతో ఇష్టంగా అందించినట్లు తెలుస్తోంది. చరణ్‌, ఉపాసన, క్లీంకార ముగ్గురి పేరుతో ఉన్న బాంగారు డాలర్స్‌ను అద్భుతమైన డిజైన్‌లో తయారు చేయించి గిఫ్ట్‌గా పంపించారని తెలుస్తోంది. ఈ ప్రచారం నిజమే ఉంటుందని ఫ్యాన్స్‌ కూడా అంటున్నారు. ఎందుకంటే చరణ్‌-తారక్‌ స్నేహ బంధం అలాంటిది మరి. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుండగా తారక్ దేవర సినిమాలో నటిస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -