Charan Upasana: చరణ్ ఉపాసన కూతురికి కలిసొస్తున్న లక్కీ సెంటిమెంట్ ఇదే!

Charan Upasana: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ తాజాగా తండ్రి అయ్యారు. సతీమణి ఉపాసన తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా అభిమానులు మెగా కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఉపాసన పుట్టబోయే బిడ్డ విషయంలో అనేక రకాల ట్రీట్ లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరి 11వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా త్వరలోనే ముగ్గురు కాబోతున్నాము అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అనుకున్న విధంగానే ఉపాసన తాజాగా ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఇది ఇలా ఉంటే తాజాగా మెగా ఇంట్లో అడుగుపెట్టిన ఈ బిడ్డకు ఒక సెంటిమెంట్ కలిసొచ్చిందంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు. అదేమిటంటే.. రామ్ చరణ్, ఉపాసన దంపతుల న్యూ బేబి నేడు అనగా జూన్ 20, 2023 న జన్మించింది. న్యూమరాలజీ ప్రకారం పాపకు 2 నెంబర్ వస్తోంది. ఇక రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి పుట్టినతేది ఆగష్టు 22. ఈ రకంగా 2 నెంబర్ సెంటిమెంట్ ఒకటి వర్కౌట్ అయిందని అభిమానులు చెప్పుకుంటున్నారు.అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన తేది సెప్టెంబర్ 2. ఈ రకంగా పాపకు మెగాస్టార్, పవర్ స్టార్ జన్మతేది నెంబర్ వర్కౌట్ అయిందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.

 

ఏది ఏమైనా చిరంజీవి కుంటుంబంలో 11 యేళ్ల తర్వాత ఒక వారసురాలు రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు అభిమానులు, శ్రేయోభిలాషులు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్కడ చూసినా కూడా ఇదే వార్త వినిపిస్తోంది. అభిమానులు ఉపాసన చెర్రీ దంపతులకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -