Ram Charan: చరణ్ రేంజ్ ఇదే.. అప్పుడు ఛీత్కారాలు ఇప్పుడు సత్కారాలు!

Ram Charan: ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు గొప్పపేరు వచ్చింది. ఆస్కార్ అవార్డు తెలుగు సినిమాను విశ్వానికి పరిచయం చేసింది. అలాంటి ఆర్ఆర్ఆర్ నిర్మించింది. దర్శక ధీరుడు రాజమౌళి ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేషనల్ కాదు ఏకంగా ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. అంతటితో ఆగకుండా గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఇక రామ్ చరణ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా కాదు కదా, పాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు రామ్ చరణ్.

ప్రస్తుతం రామ్ చరణ్ కి హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. మరదే కాకుండా నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకోవడంతో రామ్ చరణ్ పేరు ఓ రేంజ్ లో మార్మోగిపోతుంది. దాంతో హాలీవుడ్ డైరెక్టర్లే కాక ఇతర భాషల హీరోయిన్లు కూడా రామ్ చరణ్ తో కలిసి పనిచేయడానికి మోగ్గు చూపుతున్నారు. దీంతో ఒకప్పుడు రామ్ చరణ్ కి నటన రాదంటూ బాలీవుడ్ ఘోరంగా అవమానించింది. ప్రస్తుతం ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

రామ్ చరణ్ బాలీవుడ్లోకి జంజీర్ అనే సినిమాతో ఎంట్రీంచాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన ఇదే సినిమా తెలుగులో తుఫాన్ అనే పేరుతో విడుదలైంది. 2013లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో చరణ్ యాక్టింగ్ స్కిల్స్ పై బాలీవుడ్ క్రిటిక్స్ తీవ్రమైన విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఆర్ఆర్ సినిమాతో సీన్ మొత్తం మారిపోయింది.. ఈ సినిమాలో రామ్ చరణ్ చేసిన నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంది.

 

ప్రపంచంలో అతి గొప్ప చిత్రాలైన టైటానిక్ మరియు అవతార్ సిరీస్ లను వంటి అద్భుతమైన దృశ్య కావ్యాలను తెరకెక్కించినటువంటి డైరెక్టర్ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ కూడా రామ్ చరణ్ పై ప్రశంసలు గుప్పించారు. దీంతో బాలీవుడ్ సైతం చరణ్ నటనకు ఫిదా అయ్యారు. రాంచరణ్ కు నటన రాదంట గోరంగా అవమానించిన వారే ఇప్పుడు రామ్ చరణ్ కు చేతులెత్తి దండం పెడుతున్నారు. రాంచరణ్ గురించి ఆయన నటన గురించి గొప్పగా ప్రశంసిస్తూ రాతలు రాస్తున్నారు. దీంతో మెగా అభిమానులకు పండగ వాతావరణం ఏర్పడి ఎగ సంతోషంలో ఉప్పొంగిపోతున్నారు. రామ్ చరణ్ అంటే ఇది అని గొప్పగా కాలర్ ఎగరేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -