TDP Janasena: టీడీపీ జనసేన సీట్ల ప్రకటన గురించి అసలు క్లారిటీ ఇదే!

TDP Janasena: ఆంధ్రప్రదేశ్లో మరి కొద్ది రోజులలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న తరుణంలో అన్ని పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టడమే కాకుండా ఎమ్మెల్యేల టికెట్లు కేటాయింపు పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ముందుకు వెళుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి.

 

జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఎన్నికల బరిలో దిగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ రెండు పార్టీలు ఏకమై జగన్ పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇకపోతే జనసేన టిడిపి సీట్లు సర్దుబాటు గురించి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి ప్రకటన లేదు.

సీట్లు సర్దుబాటు విషయంపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయిన విషయం తెలిసిందే. ఇలా రెండుసార్లు భేటీ అయినటువంటి వీరిద్దరూ సీట్లు సర్దుబాటు విషయంలో చర్చలను పూర్తి చేశారని సమాచారం. మరోసారి కూడా సీట్లు సర్దుబాటు విషయంలో భేటీ కానున్నారని తెలుస్తోంది.

 

ఈ విధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భేటీ అనంతరం సీట్లు సర్దుబాటు విషయం గురించి అధికారకంగా వెల్లడించనున్నారు. ఈ విషయాన్ని వచ్చే నెల మొదటి వారంలో వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు విషయంలో బిజీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రా కదలిరా అనే సభకు కాస్త విరామం ప్రకటించారు. మరి సీట్ల సర్దుబాటు విషయంలో జనసేనకు ఎన్ని సీట్లు ఇచ్చారు ఏంటి అనే విషయం పట్ల అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -