Pavitra Lokesh: పవిత్ర లోకేశ్ పరువు పాయె.. పరీక్ష పాసైనా ఆమెకు ఆ సీటు ఇచ్చే ఛాన్స్ లేదట!

Pavitra Lokesh:తెలుగు సినీ ప్రేక్షకులకు సినీ నటి పవిత్రా లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది పవిత్ర లోకేష్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే హీరో హీరోయిన్ లకు మదర్ క్యారెక్టర్లలో ఎక్కువగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే సినిమాలలో నటించిన రాని గుర్తింపు ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా వచ్చిందని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా టాలీవుడ్ నటుడు నరేష్ విషయంలో ఈమె బాగా పాపులర్ అయ్యింది. అంతేకాకుండా ఈమెపై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ జరిగిన విషయం తెలిసిందే.

 

ఈ వయసులో ఇలాంటివన్నీ అవసరమా అంటూ ఒక రేంజ్ లో కామెంట్ చేశారు నేటిజన్స్. అయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా అతనితో ప్రేమాయణాన్ని కొనసాగించడంతోపాటు లిప్ లాక్ షేర్ చేసి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ కూడా ప్రకటించేశారు. ఆ సంగతి పక్కన పెడితే గత కొద్దిరోజులుగా ఈ ఎడ్యుకేషన్ కి సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీని అభ్యసించేందుకు ప్రయత్నించిన నటి పవిత్ర లోకేష్‌కు బిగ్‌ షాక్‌ ఎదురైంది.

కాగా ఇటీవల జరిగిన సీఈటీ పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత సాధించినా సీనియార్టీ, ఫైనల్‌ లిస్ట్‌లో ఆమె పేరు లేదు. దీంతో ఆమె ఆశలు ప్రస్తుతానికి నెరవేరే అవకాశాలు లేనట్లే. ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్‌ సుబ్బణ్ణరై మాట్లాడుతూ.. నటి పవిత్ర కన్నడ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసేందుకు ప్రయత్నించి సీఈటీలో ఉత్తీర్ణత సాధించినా ఉత్తమ ర్యాంక్‌ సాధించలేక పోవడంతో ఆమెకు సీటు లభించలేదని అన్నారు.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -