Temple: ఈ ఆలయం ప్రత్యేకత, గొప్పదనం ఇదే.. అసలేం జరిగిందంటే?

Temple: ప్రస్తుత కాలంలో ఎంతోమంది యువతి యువకులు సరైన సమయంలో పెళ్లి జరగకపోవడంతో ఎంతో మనస్థాపం చెందుతున్నారు. ఈ క్రమంలోనే వారి జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాల కారణంగా పెళ్లిళ్లు చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇలా ఎన్ని సంబంధాలు చూసిన పెళ్లికానటువంటి వారు ఎన్నో ఆలయాలకు వెళ్లి స్వామివారికి మొక్కలు చెల్లించుకుంటూ ఉంటారు. ఇలా పెళ్లి కాని వారుపెళ్లి కావాలి అంటే ఈ గణపతి ఆలయానికి వెళ్తే చాలు వివాహం జరిగి అన్ని సమస్యలు తీరుతాయని తెలుస్తుంది మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆలయ ప్రత్యేకత ఏంటి అనే విషయాన్ని వస్తే…

ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఇడగుంజి గణపతి ఆలయం ఉంది.ఈ ఆలయంలో వినాయకుడికి కేవలం రెండు చేతులతో మాత్రమే ఉంటారు ఒక చేతిలో లడ్డు మరొక చేతిలో కమలంతో మనకు దర్శనమిస్తారు. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతంలో ఋషులు సంచరించే వారట. ఇక్కడే తపస్సు చేసుకునే వారిని తెలుస్తుంది. ఇక వినాయకుడు విగ్రహం వద్ద మనకు ఎలుక కనిపించదు ఇక్కడ స్వామివారికి గరికపెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని తెలుస్తుంది. ఇక ఈ వినాయకుడు పెళ్లిలను నిశ్చయిస్తారని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.

 

ఎవరైతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారో అలాంటివారు ఈ ఆలయానికి వెళ్లి వరుడు వధువు కుటుంబ సభ్యులు రెండు చీటీలను రాసి స్వామి వారి పాదాల చెంత పెడతారట.అయితే కుడి కాలి వద్ద ఉన్న చీటీ కిందకి పడితే ఆ ఇద్దరికీ పెళ్లి చేయడం చాలా మంచిదని వినాయకుడు నిశ్చయించారని భావిస్తారు. ఒకవేళ ఎడమ కాలు వద్ద ఉన్నటువంటి చీటీ కనుక కింద పడితే ఆ జంటకు పెద్దలు వివాహం చేయరు.ఈ ఆలయంలో వినాయకుడి గొప్పతనం ఇదేనని అందుకే ఈ స్వామివారి ఆలయాన్ని పెళ్లిళ్లు నిశ్చయించే గణపతి అని కూడా పిలుస్తుంటారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -