BJP: బీజేపీ గమనించాల్సిన సత్యమిదే.. మతం పేరుతో మాయ చేయొద్దంటూ?

BJP: కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మతాల పేరుతో దేశ ప్రజలను మాయ చేసి ఓట్లు పొందడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే రథయాత్ర పేరిట ఉత్తరాది రాష్ట్రాల ప్రజలలో మతం మత్తు ఎక్కించి వారి నుంచి పెద్ద ఎత్తున ఓట్లను లబ్ధి పొందుతున్నారు. అయితే ఇదే ఆచరణను దక్షిణాది రాష్ట్రాలలో పెట్టాలని బిజెపి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అయితే దక్షిణాది ప్రజలు మాత్రం బిజెపి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని మాయని గమనించి తిప్పి కొట్టారు.

కర్ణాటకలో ఎలాగైనా తమ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం మతం పేరుని భారీగానే బిజెపి ప్రభుత్వం ఉపయోగించుకుందని చెప్పాలి. హిజాబ్ వివాదం తెచ్చారు. హలాల్ అన్నారు. చివరికి క్లైమాక్స్‌లో బజరంగ్ దళ్ అంశాన్ని ఎత్తుకున్నారు.కానీ ఫలితాలు చెప్పిందేమిటంటే మత రాజకీయాలు చేస్తే పడిపోవడానికి తాము ఉత్తరాది ప్రజలు కాదని దక్షిణాది ప్రజలని తేల్చి చెప్పారు. ఇక్కడ కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటామని తాజాగా ఎన్నికల ద్వారా బిజెపికి బాగా బుద్ధి చెప్పారు.

 

అయితే బిజెపి ప్రభుత్వం ఈ ధోరణిని కేవలం కర్ణాటకలో మాత్రమే కాకుండా తెలంగాణ, కేరళలో, తమిళనాడులో కూడా మతం పేరును అడ్డుపెట్టుకొని ఓట్లు పొందడం కోసం ప్రయత్నాలు చేయడంతో ఆ రాష్ట్రాలలో కూడా తిప్పి కొట్టారు.ఇలా బిజెపి ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుందన్న విషయాన్ని గ్రహించిన దక్షిణాది ప్రజలు ఓటుతో బిజెపికి బుద్ధి చెబుతున్నారు.

 

ఇక గత ఎన్నికలలో కూడా బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దక్షిణాది రాష్ట్రాలు ఏమాత్రం కారణం కాదని తెలుస్తుంది. కేవలం ఉత్తరాది రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వానికి అత్యధికంగా ఓట్లు పడటంతోనే బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలుస్తుంది. ఇలా బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మతం పేరిట ఉత్తరాది రాష్ట్రాలలో చేసిన ప్రచారమేనని అయితే వచ్చే ఎన్నికలలో బిజెపి ప్రభుత్వానికి ఈ స్థాయిలో కూడా ఓట్లు రావని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -