Vishnu: మనోజ్ వీడియోపై విష్ణు క్లారిటీ ఇదే.. ఏం జరిగిందంటే?

Vishnu: మంచు కుటుంబంలో గత కొద్ది రోజులుగా విభేదాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇలా ఈ విభేదాల కారణంగానే మంచు మనోజ్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని అందుకే తన పెళ్లి బాధ్యతులను మొత్తం మంచు లక్ష్మి తీసుకుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే మంచు విష్ణు మనోజ్ పెళ్లికి ఒక అతిథిలా వచ్చి వెళ్లిపోయారు.ఇక మంచు మనోజ్ విష్ణు వ్యవహారం చూస్తుంటే వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని అర్థమవుతుంది అయితే తాజాగా నేటితో ఈ గొడవలు తేటతెల్లమయ్యాయి.

మంచు విష్ణు మనోజ్ ఇద్దరు గొడవ పడుతున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇంటి పరువు మొత్తం బజారున పడినట్లు అయింది. సారధి అనే వ్యక్తి కారణంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు గొడవలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. సారధి గత కొంతకాలంగా మంచు కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. అయితే గతంలో విష్ణుకి అనుచరుడుగా ఉన్నటువంటి సారథి ప్రస్తుతం మనోజ్ కు దగ్గర అవడంతో విష్ణు సహించుకోలేక తనపై గొడవకు దిగారని తెలుస్తోంది.

 

ఈ క్రమంలోని సారథి ఇంటికి వెళ్లినటువంటి విష్ణు సారధి పై దాడి చేయడమే కాకుండా మనోజ్ పై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోని మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తను తన స్నేహితులు బంధువుల ఇళ్లకు వచ్చి ఇలాగే దాడి చేస్తూ ఉంటారని ఈ వీడియోని షేర్ చేశారు. అయితే ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో సంచలనంగా మారింది. ఈ ఘటనపై మోహన్ బాబు రంగంలోకి దిగడంతో వెంటనే మనోజ్ ఈ వీడియోని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.

 

ఇక ఈ వీడియోపై తాజాగా విష్ణు స్పందించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ఇది నిన్న జరిగిన గొడవ నాకు మనోజ్ కు మధ్య ఇలాంటి గొడవలు తరచూ జరుగుతూ ఉంటాయి. ఇవి చాలా చిన్నవి. నేను సారధితో గొడవ పడుతుంటే వాడు మాత్రం వీడియో తీస్తూ కూర్చున్నాడు కానీ గొడవ ఆపలేదని తెలిపారు. మనోజ్ చిన్నవాడు తనకు ఆవేశంలో తెలిసో తెలియకో ఈ వీడియోని షేర్ చేశారు. దీనిని పెద్దదిగా చేసి భూతద్దంలో పెట్టి చూడకండి. ఇలాంటివన్నీ మాకు సర్వసాధారణం అంటూ ఈ వీడియో పై విష్ణు క్లారిటీ ఇచ్చారు. ఇలా విష్ణు చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -