Balayya NTR: ఈ సినిమా బాలయ్య ఎన్టీఆర్ కు చాలా స్పెషల్.. ఏ సినిమా అంటే?

Balayya NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ ఉందో మనకు తెలిసిందే. ఇలా నందమూరి కుటుంబంలో నుంచి మూరో తరం వారసుడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ బాలయ్య కాంబినేషన్లో వచ్చినటువంటి ఓ సినిమా గురించి చాలామందికి తెలియదు. అయితే ఈ సినిమా ఇప్పటికీ విడుదలకు నోచుకోకపోవడం గమనార్హం. మరి వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటి అనే విషయానికి వస్తే…

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాల రామాయణం సినిమాలో రాముడి పాత్ర ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనంతరం నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా పూర్తిస్థాయి హీరోగా ఈయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్నారు. అయితే మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలో ఎన్టీఆర్ హిందీ అనర్గళంగా మాట్లాడటం చూసిన సీనియర్ ఎన్టీఆర్ ఆయన దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమాలో ఎన్టీఆర్ ను భరతుడి పాత్ర కోసం తీసుకున్నారు.

 

తెలుగులో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ హరిచంద్రుడిగా దుష్యంతుడిగా నటించారు. అయితే దుష్యంతుడి కొడుకు భరతుడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ను బాల నటుడిగా ఎంపిక చేశారు. ఈ సినిమా హిందీ తెలుగు భాషలలో ఏకకాలంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమాని తెలుగులో విడుదల చేయగా ఈ సినిమా తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో హిందీలో ఈ సినిమాని విడుదల చేయడానికి సీనియర్ ఎన్టీఆర్ కాస్త వెనకడుగు వేశారు.

 

ఇక ఈ సినిమా హిందీ వర్షన్ లో విడుదల చేయాలి అనుకుంటున్న సమయంలోనే సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఇలా ఈయన రాజకీయ రంగంలో బిజీగా ఉండడంతో ఈయన దర్శకత్వంలో హిందీ వర్షన్ లో వచ్చినటువంటి బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేకపోయింది ఇలా బాలకృష్ణ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా విడుదల కాలేదు. ఇలా ముగ్గురు నందమూరి హీరోలు పనిచేసిన ఒక సినిమా విడుదలకు నోచుకోకపోవడం గమనార్హం.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -