Siddipet: ఈ వృద్ధుడు తనకు తానే చితి పేర్చుకుని చనిపోయాడు.. ఎందుకంటే?

Siddipet: ప్రస్తుత సమాజంలో చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్ల పుడితే చిన్నచూపు చూడడం మగ పిల్ల వాడు పుడితే సంబరాలు చేసుకోవడం, b కొడుకు పుడితే పున్నామ నరకం నుండి రక్షిస్తాడని తమ వంశం అభివృద్ధి చెందుతుందని ఎన్నో రకాల కలలు కంటున్నారు. కొడుకుల కోసం పడరాని కష్టాలు పడి కని పెంచి పెద్ద చేస్తున్నారు. ఆ పిల్లలు వారి తల్లిదండ్రులకు వృద్ధాప్యం వచ్చేసరికి దారుణంగా రోడ్డుపై విడిచి వెళ్లిపోవడం కొంతమంది అడ్డుగా ఉన్నారని చంపేయడం లాంటి పనులు కూడా చేస్తున్నారు. ఇంకొందరు అనాధాశ్రమాలలో వదిలి పెడుతున్నారు. నలుగురు ఐదుగురు కుమారులు ఉంటే తల్లిదండ్రులను చూసుకోవడం వంతుగా భావిస్తున్నారు.

అలా తాజాగా కూడా ఒక తండ్రి తన బాగోగులు నలుగురు కుమారులు వంతులు వేసుకోవడాన్ని సహించలేకపోయాడు. దాంతో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఆ వృద్ధుడు తీసుకున్న నిర్ణయం చాలామందిని కంటతడి పెడుతోంది. అసలేం జరిగిందంటే.. ఒక వృద్ధుడికి నలుగురు కుమారులు కాగా ఆ కుమారులు ఒక్కొక్కరు ఒక్కొక్క నెల చొప్పున వంతుల వారిగా పోషించాలి అనే ఇటీవలే ఐదు నెలల క్రితం గ్రామ పెద్దలు నిర్ణయించారు. అయితే పెద్ద కుమారుడి వద్ద గడువు పూర్తి అయినా మరో కుమారుడి వద్దకు వెళ్లలేదు. సొంత ఊరిని, ఇంటిని వదిలి అక్కడికి తాను వెళ్లనని చెప్పేవారు అయినప్పటికీ గ్రామ పంచాయతీ తీర్పుకు కట్టుబడి మరో కుమారుడు వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

 

తాజాగా సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరిన ఆ వృద్ధుడు గ్రామంలోని ఒక ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. అక్కడ తన బాధను పంచుకున్నారు. ఇక మరుసటి రోజు ఉదయం లేచి నవాబుపేటలోని తన మరో కుమారుడి ఇంటికి వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ సాయంత్రం అవుతున్న కూడా ఆ వృద్ధుడు ఏ కుమారుడు ఇంటికి వెళ్లలేదు. ఇక అదే రోజు మధ్యాహ్నం పొట్లపల్లి గ్రామంలో ఎల్లమ్మ గుట్ట సమీపంలో మంటల్లో కాలిన స్థితిలో వృద్ధుడు మృతదేహం కనిపించింది. అయితే ఆ మృతదేహం వెంకటయ్యదే అని కుమారులు కుటుంబ సభ్యులు గుర్తించారు. తన కుమారులు తనను పంచుకోవడాన్ని చూసి మనస్థాపానికి గురైన తండ్రి వారి పై తాను ఆధారపడకూడదని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. దాంతో తనకు తాను చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలంలో తాటికమ్మలను ఒకచోట కుప్పగా వేసి వాటికి నిప్పంటించి, అందులో దూకి ఆత్మాహుతికి పాల్పడినట్లు ఏఎస్‌ఐ మణెమ్మ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో పాటు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -