Pawan Kalyan Fan: ఈ పవన్ కళ్యాణ్ అభిమాని గొప్పోడే.. కొడుకుకు అలాంటి పేరు పెట్టడంతో?

Pawan Kalyan Fan: సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలో కూడా చాల చురుగ్గా ఉంటున్నారు. ఇలా సినీ నటుడిగా రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉండడమే కాకుండా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే స్వయంగా ఆయన పేరును ఆయన పార్టీ పేరును కూడా తమ పిల్లలకు పేర్లుగా పెట్టుకునే అంత అభిమానం ఉందని చెప్పాలి.పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకోవడం సర్వసాధారణం కానీ ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ జనసేన పార్టీ పేరును కూడా తమ పిల్లలకు పెట్టుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమాని తన కుమారుడికి ఏకంగా జనసేన అని పేరు పెట్టడం ప్రస్తుతం వైరల్ గా మారింది.

 

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం హాలిగేర గ్రామానికి చెందిన జలపతి హనుమంతు వన్నమ్మ దంపతులకు 2019వ సంవత్సరంలో ఇద్దరు కవల మగపిల్లలు జన్మించారు. ఈ క్రమంలోనే వీరిలో ఒక బిడ్డకు హనుమంతు ఏకంగా జనసేన అని నామకరణం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే చిన్నారికి సంబంధించిన ఆధార్ కార్డు ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

 

ఈ క్రమంలోనే చిన్నారి తండ్రి హనుమంతు మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని తెలిపారు. అయితే పెళ్లి కాకముందు నాకు కనక కొడుకు పుడితే తప్పకుండా జనసేన అని పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నాను అందుకే తనకు కుమారుడు జన్మించడంతో జనసేన అనే నామకరణం చేసి మొక్కు చెల్లించుకున్నాను అంటూ ఈ సందర్భంగా హనుమంతు తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ అంటే ఈయనకు ఏ స్థాయిలో అభిమానం ఉందో తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -