YCP MLA: ఈ వైసీపీ ఎమ్మెల్యే మామూలోడు కాదుగా.. పబ్లిక్ గానే ఇలా చేస్తారా?

YCP MLA: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న వైసీపీ అభ్యర్థి పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు భారీ ఎత్తున కుక్కర్లు పంపిణీ చేశారు. ఒక్కొక్క కుక్కరు ఖరీదు 2000 ఉంటుంది. సెంట్రల్ లో వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించే వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి వీటిని అందజేశారు. ఇదంతా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన సంఘటన.

 

వాలంటీర్లు బహిరంగంగా కుక్కర్లను మోసుకుంటూ తీసుకెళ్లగా, సచివాలయ సిబ్బంది మాత్రం రహస్యంగా తీసుకెళ్లారు. అయితే ఇవి ప్రలోభాల కిందకి రావా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిఘా విభాగం సిబ్బంది ఈ సమాచారం ఉన్నతాధికారులకు పంపినా ఏ చర్యలు లేవు. సెంట్రల్ లో ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ని ప్రభుత్వం నియమించగా 1057 మంది వాలంటీర్లు ఉన్నారు. ఈ మేరకు వాలంటీర్లు మహిళల తరఫున భర్తలు వచ్చి వెల్లంపల్లి అందించిన కుక్కర్లు అందుకున్నారు.

వార్డు సచివాలయం సిబ్బంది అయితే యూనిఫామ్స్ వేసుకుని వచ్చి మరి అందుకున్నారు. సెంట్రల్ లో వాలంటీర్లకు సచివాలయ సిబ్బంది కుక్కర్లు నగదు పంపిణీ పై ఎన్నికల అధికారి విఎంసి కమిషనర్ దినకర్ విచారణకు ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే తెదేపా ఇన్చార్జి బోండా ఉమామహేశ్వరరావు దీనిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. బెల్లంపల్లి తనని ఉద్దేశించి చేసిన ధూషణ పై బోండా ఉమా నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

 

ప్రభుత్వ గౌరవ వేతనం పొందుతున్న వాలంటీర్లు ఎలాంటి బహుమతులు తీసుకోకూడదు, ఎన్నికల విధులకు దూరంగా ఉండాలి, ప్రచారంలో పాల్గొనకూడదు దీనికి విరుద్ధంగా వ్యవహరించినట్లు వాలంటీర్లు సచివాలయం సిబ్బందిపై ఆరోపణలు వచ్చినందున పూర్తి విచారణ చేయాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఎన్నికల అధికారి హోదాలో నగల పోలీస్ కమిషనర్ కి లేఖ రాశారు. మరి వాలంటీర్ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -