Districts: ఈ రెండు జిల్లాల్లో ఎక్కువ సీట్లు వచ్చిన వారికి అధికారం వస్తుంది…

Districts: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు రాజకీయ జనం. మొదటి కౌంటింగ్ ఆయన నియోజకవర్గంలో దగ్గర నుండి మొదటి గెలుపొందిన సీటు ఇలా ప్రతిదీ ఏదో ఒక సెంటిమెంట్ తో నిండి ఉంటుంది. అయితే రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే కొన్ని జిల్లాల్లో సీట్లు కీలకమైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకుంటే రెండు జిల్లాల సీట్లు చాలా కీలకంగా కనబడుతున్నాయి ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ సాధించిన పార్టీనే ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపడుతుంది. ఈ సెంటిమెంట్ గత కొద్ది ఎన్నికలుగా రిపీట్ అవుతూనే ఉంది.

 

ఆ జిల్లాలో అనంతపురం జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. ఈ రెండు జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుందని రాజకీయాల్లో ఎప్పటినుండో బలపడిన సెంటిమెంట్. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో చూసుకుంటే ఉమ్మడి పరిస్థితి గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించింది. ఇక అధికారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే చేపట్టింది. ఈ లెక్కను చూసుకుంటే 2024 లో కూడా ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు.

గోదావరి జిల్లాలు జనసేనకి బాగా బలం.అందులోనూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సొంత జిల్లా పశ్చిమగోదావరి. ఈ జిల్లాలో కాపులు ఓటింగ్ ఎక్కువ. ఈసారి పశ్చిమగోదావరి జిల్లా జనసేన కి బాగా కలిసి వచ్చే జిల్లాగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా రెండు గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక సీట్ కూడా రాకుండా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ రెండు జిల్లాల్లోనూ జనసేన అధిక శాతం సీట్లలో నిలబడే అవకాశం ఉంది. కొత్తలో భాగంగా టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో క్లీన్ స్వీఫ్ చేసే అవకాశం బాగా ఉంది. ఇక అనంతపురం జిల్లాలో కూడా మెజారిటీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. జనసేనతో కలిసి పోటీ చేస్తే మిగతా నియోజకవర్గాలు కూడా ఈ రెండు పార్టీలు కైవసం చేసుకునే అవకాశం ఉంది.అందుకే రాజకీయ పార్టీల నాయకులు ఈ రెండు జిల్లాలు పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -