Telugu Desham Party: తెలుగుదేశం పార్టీలో టికెట్ల మంట.. చంద్రబాబు ఏం చేస్తారో?

Telugu Desham Party: తెలుగుదేశం పార్టీలో యుద్ధం మొదలైంది. పార్టీ అధిష్టానంతో సంబంధం లేకుండా టిక్కెట్ నాది అంటే నాది అని పోటీ పడుతున్నారు. టికెట్ కోసం నానా తంటాలు పడుతున్నారు. పార్టీలో కష్టపడే పని చేస్తున్న వాళ్ళు కొందరు.. షో పీసులుగా ఉన్నవాళ్లు కొందరు. ఈ వాదన ఎప్పటినుంచో ఉంది కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఈ వాదన మరింత బలమవుతుంది. నాలుగేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళని మానేసి కనీసం పార్టీ కార్యకలాపాలలో కూడా పాటిస్పేట్ చేయని నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

దీనివల్ల క్యాడర్ కి సమాధానం చెప్పుకోలేకపోతున్నాం అని ఒక మాజీ ఎమ్మెల్యే మీడియా ముందు తన ఆవేశాన్ని వెళ్ళగక్కారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలోబిజీగా ఉన్నారు.ముందస్తు ఎన్నికల అవకాశం ఉందని భావిస్తున్న చంద్రబాబు మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు అందుకే ఎన్టీఆర్ భవన్ కి తమ విన్నపాలు కష్టాలు చెప్పుకోవటానికి యాక్టివ్గా ఉండే నాయకులు వస్తున్నారు.

 

వ్యక్తులతో సంబంధం లేకుండా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే అందరూ పనిచేయాలని ముఖ్యమంత్రి సూచిస్తున్నారు. ఆయన అలా మాట్లాడటానికి కారణం ఏమిటంటే వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవి.. ఎవరిని నొప్పించినట్లు మాట్లాడినా పార్టీకే నష్టం. అందుకే ఎవర్ని నొప్పించకుండా అందర్నీ కలుపుకొని పోయేలాగా పావులు కదుపుతున్నారు చంద్రబాబు నాయుడు. అయితే ఆయన ఇచ్చిన సలహాకి కొందరు సమర్థిస్తున్నారు.

 

మరి కొందరు మాత్రం ఆయన అభిప్రాయాన్ని ఏకీభవించలేకపోతున్నారు. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల వల్లే పార్టీ దెబ్బతింటున్నదని.. పార్టీలకే న్యాయం చేయలేని చంద్రబాబు ప్రజలకు ఏమి చేయగలరని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టిక్కెట్ల కోసం పార్టీలో మొదలైన మంట చంద్రబాబు ఎలా చల్లారుస్తారో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -