TDP-YSRCP: ఆ నియోజకవర్గంలో చేతులెత్తేసిన వైసీపీ.. టీడీపీ అభ్యర్థిదే విజయం అంటూ?

TDP-YSRCP: జగ్గయ్యపేట నియోజవర్గం కృష్ణాజిల్లాకే కాదు.. ఏపీలో అత్యంత కీలకమైన నియోజవర్గం. రెండు తెలుగు రాష్ట్రాల బోర్డర్‌లో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ఇంత వరకు ఎవరూ మంత్రి పదవులు చేపట్టలేదు. కానీ, ఈ సారి అధికారంలోకి వచ్చే పార్టీ ఖచ్చితంగా జగ్గయ్యపేట ఎమ్మెల్యేకు మంత్రి పదవిని ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఇప్పుడు నియోజవర్గంలో రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. ఇక్కడ ప్రతిపక్ష తెలుగు దేశం రెండు అడుగులు ముందుంది. టీడీపీ అభ్యర్థి పేరు దాదాపు ఖారారు అయినట్టే తెలుస్తోంది. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన శ్రీరాం రాజగోపాల్‌కే టికెట్ కేటాయించనున్నట్టు తెలుస్తోంది. అయితే, వైసీపీలో మాత్రం ఇంకా ఎవరికి టికెట్ ఇస్తారో తెలియడం లేదు. అందుకే ఆ పార్టీ నేతలు గప్‌చుప్‌గా ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే సామినేని ఉదయబాను పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. అందుకే టికెట్ కేటాయింపులో వైసీపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

గత ఎన్నికల్లో జగ్గయ్యపేటలో వైసీపీ విజయం సాధించింది. వైసీపీకి 50శాతం ఓట్లు వస్తే.. టీడీపీకి 47 శాతం ఓట్లు వచ్చారు. జనసేనకు 3 శాతం ఓట్లు పడ్డాయి. ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసే ఉన్నాయి కనుక ఈసారి శ్రీరాం రాజగోపాల్ గెలుపు ఖాయంగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరకత కనిపిస్తోంది. అందుకే.. గతసారి వచ్చిన 50శాతం ఓట్లు ఈసారి వైసీపీకి రావు. అంతేకాదు.. టికెట్ కేటాయింపులో ఉన్న గందరగోళం కూడా వైసీపీ కేడర్ ను అయోమయానికి గురి చేస్తుంది. ఎవరు పోటీ చేస్తారో తెలియదు. జగ్గయ్యపేట టికెట్ తనకేనని వాసిరెడ్డి పద్మ ప్రచారం చేసుకుంటున్నారట. ఈ విషయాన్ని అధిష్టానం కూడా ఖండించలేదు. అందుకే, ప్రస్తుత ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పక్కచూపులు చూస్తున్నారు. అందుకే ఈసారి వైసీపీ ఓటమి ఖాయంగా తెలుస్తోంది.

దీనికి తోడు టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ వ్యక్తిత్వం కూడా కూటమికి ప్లస్ అవుతుందనే చెప్పాలి. రాజగోపాల్ పార్టీ నేతలనే కాకుండా ఓటర్లను కూడా కలుపుకొని పోతారు. పెళ్లి, చావు కార్యాలకు తప్పక హాజరవుతారు. కార్యకర్తలే కాదు నియోజవర్గంలో ఎవరైనా సమస్యల్లో ఉన్నారంటే ఇంటి వెళ్లి పరామర్శిస్తారు. పేదలకు స్కూలు ఫీజులు, మెడికల్ బిల్లులు కట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. దీంతో.. ఆయన అందరి వాడు అనిపించుకున్నాడు. ఇక్కడ సమాజికవర్గ లెక్కలు కూటా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. జగ్గయ్యపేటలో కాపు, కమ్మ సమాజిక వర్గం ప్రభావం ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు శ్రీరాం రాజగోపాల్ వైశ్య వర్గానికి చెందిన వ్యక్తి. కాబట్టి ఆ సామాజిక వర్గం కూడా కలిసి వస్తుంది. స్థానిక ఎన్నికల్లోనే వైసీపీకి జగ్గయ్య పేటలో చుక్కుల కనిపించాయి. ఎన్ని దాడులు, దౌర్జన్యాలు చేసినా వైసీపీ ఓటమి అంచుకు వెళ్లి బయటపడింది. అటు చంద్రబాబు అరెస్ట్ సింపతి ఈ నియోజకవర్గంలో పని చేస్తుంది. అటు, గత ఎన్నికల్లో శ్రీరాం రాజగోపాల్ ఓడిపోయారు కనుక.. ఆ సింపతి కూడా వర్క్ అవుట్ అవుతుంది. దీంతో.. జగ్గయ్య పేటలో టీడీపీ జెండా ఎగరేయడం ఖాయంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -