Tollywood: ఈ ప్రముఖ హీరోయిన్ల అసలు పేర్లు మీకు తెలుసా?

Tollywood: హీరోయిన్లు తమ అందచందాలతో అలరిస్తే చూసి మురిసిపోయే మనకు.. వారి వారి గురించి పూర్తిగా తెలియదు. చాలా మంది హీరోయిన్లు ఏదో చేద్దామని వచ్చి చివరికి హీరోయిన్ గా విజయాలు సాధించారు. ఇక వారిలో కొంత మంది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వారి వారి పేర్లు మార్చుకున్నారు. కొందరు పాపులారిటీ కోసం పేర్లు మార్చుకోగా.. మరికొందరు న్యూమరాలజీ అని, మరికొందరైతే అభిమానులు పిలుచుకునే పేర్లనే తమా పేర్లుగా మార్చుకున్నారు. అసలు విషయం ఏంటంటే చాలా మంది స్టార్ హీరోయిన్ ల పేర్లు ఇప్పుడు మనం పిలుచుకునే పేర్లు కాదు. వాటిలో కొందరి పేర్లు మీకోసం..

 

టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు దేశంలోని సినీ ప్రియులందర్నీ అలరించిన అలనాటి అందాల భామ శ్రీదేవి.. తన అసలు పేరు వింటే మీరు షాక్ అవ్వాల్సిందే. శ్రీదేవి గా మనం పిల్చుకునే ఆ ముద్దులసుందరి పేరు “శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్”. టాలీవుడ్ సుందరిగా పేరుగాంచిన హీరోయిన్ సౌందర్య అసలు పేరు “సౌమ్య సత్యనారాయన్”. తన అందాలతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న రాశి అసలు పేరు “విజయలక్ష్మి” నిజంగా వీరిని మనం పిలుచుకునే పేరు కాకుండా వారి పేరుతో అసలు ఉహించుకోలేకపోతున్నారు కదూ..!

 

ఇక ఒక తరం టాలీవుడ్ ని ఏలి ఇప్పటికీ.. హీరోయిన్ గా కాకుండా పలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న నటి భూమిక పేరు “అర్చన చావ్లా” అంటే నమ్ముతారా? సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఏంటో నాకన్నీ అలా తెలిసిపోతాయి అంతే అంటూ.. ప్రతి తెలుగింట గోల చేసిన నటి అంజలి పేరు “బాల త్రిపుర సుందరి”. ఇక ఒకానొక దశలో తెలుగు ఇండస్ట్రీని ఏలిన జయసుధ మరియు జయప్రద ల అసలు పేర్లు సుజాత మరియు లలితారాణి అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఇలా స్క్రీన్ నేమ్స్ తో పాపులర్ అయ్యి అలానే కొనసాగారు చాలా మంది హీరోయిన్స్.

 

బాలీవుడ్ లో కూడా ఈ పేరు మార్పులు ఉన్నాయి. మనందరికీ సుపరిచితమైన భామ కియారా అద్వానీ అసలు పేరు “అలియా అద్వానీ”. అవునండీ ఇలా ఇంకా ఎంతో మంది తారలు ఇలా మారుపేర్లతో చెలమని అయ్యి మంచి హిట్స్ సాధించారు. మనం కూడా వారిని అదే పేరుతో గుర్తు పెట్టుకోవడంతో ఇక వారికి అదే అసలు పేరుగా ముద్ర పడిపోయింది. అయితే కొందరు కావాలనే పేరు మార్చుకోగా, మరికొందరు దర్శక నిర్మాతల సూచనా మేరకు మార్చుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -