Tollywood: ఈ ప్రముఖ హీరోయిన్ కు ఆ హీరో అంటే ఇంత ఇష్టమా?

Tollywood: యువ కథానాయిక ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దూసుకుపోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ తనదైన నటనతో ఆకట్టుకుంటోంది. అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది అ ముద్దుగుమ్మ. మళయాల ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు.. అందంతో పాటు అభినయంతో యువతలో క్రేజ్‌ సంపాదించుకుంటోంది.

 

పోయిన ఏడాది అమ్ము, పొన్నియన్‌ సెల్వన్‌, మట్టి కుస్తి లాంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఐశ్వర్య లక్ష్మీ. ఆ సినిమాల్లో మంచి నటనతో గుర్తింపు తెచ్చుకోవడంతో ఇక అవకాశాలు వెతుక్కంటూ వస్తున్నాయట. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో నిమగ్నమైంది ఈ యువ హీరోయిన్‌.

 

దక్షిణాదిలో బిజీయెస్ట్‌ నటీమణిగా మారిపోయింది ఐశ్వర్య లక్ష్మీ. తాజాగా ఈ అమ్మడు ప్రేమలో పడినట్లు వెల్లడించింది. మాస్టర్‌, విక్రమ్ వంటి సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్‌దాస్‌తో ఐశ్వర్య ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఈ విషయం హోరెత్తిపోతోంది. తన ఇన్‌స్టా గ్రామ్‌లో అర్జున్‌దాస్‌తో దిగిన ఫొటోను పంచుకుంది ఐశ్వర్య లక్ష్మీ. అనంతరం కొన్నాళ్లకు ఏకంగా తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

 

కొత్త సినిమా ప్రచారమా?
తన ఇన్‌స్టాగ్రామ్‌లో అర్జున్‌దాస్‌తో దిగిన ఫోటోను పోస్టు చేసింది. ఇందుకు లవ్‌ సింబల్‌ను కూడా జోడించింది. ఈ పోస్ట్‌పై హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌ సో హ్యాపీ అంటూ కామెంట్ చేసింది. అయితే, ఆ మధ్య ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ప్రశ్నలపై స్పందించి, తనకు అసలు పెళ్లంటేనే ఇష్టం లేదని స్పష్టం చెప్పిన విషయాన్ని ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. పెళ్లిపై అలా అభిప్రాయం చెప్పిన కొన్ని రోజులకే ప్రేమను వ్యక్తపరచడంతో అభిమానులు విస్తుపోతున్నారు. కొత్త సినిమా ప్రమోషన్.. అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై అధికారికంగా వెల్లడిస్తేగానీ క్లారిటీ రాదని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -