Tollywood: ఈ హీరోయిన స్వభావం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tollywood: టాలీవుడ్ లో గత కొంత కాలంగా లేడీ ఓరియంటెడ్ సినిమాల హవా ఎక్కువవుతోంది. గతంలో ఒకటో రెండో లేడీ ఓరియంటెడ్ సినిమాలు థియేటర్లలో సందడి చేసేవి. అవి కూడా ఎప్పటికో ఐదేళ్లకు ఆరేళ్లకు ఓ సినిమా విడుదలై అందర్నీ అలరించేది. కానీ ఇప్పుడు మాత్రం ఏడాదికి రెండు మూడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు విడుదల అవుతున్నాయి. అవి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. దీంతో తెరపై లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు భారీ డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు.

 

తాజాగా సమంత నటించిన యశోద సినిమా లేడీ ఓరియంటెడ్ గానే తెరకెక్కి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలై పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్ నయనతార నటించిన కనెక్ట్ సినిమా కూడా లేడీ ఓరియంటెడ్ గానే విడుదలై థియేటర్లలో సందడి చేసింది.

 

అయితే కనెక్ట్ సినిమా కంటెంట్ అంతగా అర్థం కాకపోవడంతో కలెక్షన్స్ కూడా సరిగా అందుకోలేక పోయింది. ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ కూడా ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఈ మధ్యనే నటించింది. బటర్ ఫ్లై సినిమా ద్వారా ఆమె తన నటనలోని మరో యాంగిల్ ను చూపించిందనే చెప్పాలి. బటర్ ఫ్లై సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

 

ఇలా వరుసగా హీరోలతో సంబంధం లేకుండా హీరోయిన్లు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. త్వరలోనే సమంత హీరోయిన్ గా నటించిన “శాకుంతలం” సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదలైంది. ట్రైలర్ ఆధారంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17వ తేదిన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సమంత నటనను చూడాలంటే అప్పటి వరకూ వేచి ఉండాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -