Tollywood: తెలుగు ఇండస్ట్రీలో ఆ టాలెంట్ ఉన్న హీరోలు వీళ్లిద్దరు మాత్రమేనా.. ఎవరికీ సాధ్యం కాదంటూ?

Tollywood: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. వీరిద్దర్నీ పోల్చుకుంటే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కంటే కాస్త సీనియర్ అన్ని విషయాలను ముందుగానే ఉంటారని చెప్పవచ్చు. కాగా 2021 లో విడుదలైన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవలే పుష్ప సినిమాకు గాను ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డుని అందుకొని అరుదైన ఘనతను సాధించారు.

69సినీ చరిత్రలో ఏ హీరో కూడా దక్కించుకునే అవార్డును దక్కించుకొని సరికొత్త రికార్డును సృష్టించారు. విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారుతాడు అని అభిమానులు మూవీ మేకర్స్ అలాగే విజయ్ కూడా భావించాడు. కానీ ఊహించని విధంగా ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ ను చవి చూసింది. ఇక ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ఖుషీ. ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి ఎందుకు అని అనుకుంటున్నారా. టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉండగా ఈ ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం ఒక విషయంలో ఇద్దరు ఒకటే అన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఆ వివరాల్లోకి వెళితే.. సినిమా ఇండస్ట్రీలో ఏం జరిగినా సరే తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉన్న ఇద్దరు హీరోలు విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ మాత్రమే అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు అల్లు అర్జున్ కూడా ఈ మధ్యకాలంలో బేబీ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయిలు ముందుకు రండి. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉండడం చాలా ఇంపార్టెంట్ అని తెలిపారు. అంతేకాదు విజయ్ దేవరకొండ సైతం తన ఈవెంట్లో తన సినిమా ప్రమోషన్స్ లో రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నకు చాలా బోల్డ్ గా ఉంది అంటూ సమాధానం ఇస్తారు. ఆ తర్వాత ట్రోలింగ్ జరుగుతుందా? నెగటివ్గా కామెంట్ చేస్తారా? లేదా అనే విషయాలను పెద్దగా పట్టించుకోరు. ఇద్దరు హీరోలు ఆ విషయంలో ఒక్కటే అని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -