Tollywood: ఈ స్టార్ హీరోలకు పెళ్లి జరగడం కష్టమేనా?

Tollywood: తెలుగు సినిమా కీర్తి ఎంతో బాగా విస్తరించి ఉంది. తెలుగు హీరోలు కూడా బాగా కష్టపడుతూ ఇండస్ట్రీకి మంచి పేరు తేవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే సినిమా హీరోలు తమ కెరీర్ మీద పెట్టిన ఫోకస్ ని తమ వ్యక్తిగత జీవితాల మీద పెట్టడం లేదు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో పెళ్లి కాని హీరోల జాబితాలో చాలా పెద్దదిగా ఉంది. పెళ్లి వయసు మీదపడినా కానీ చాలామంది ఆ ఊసే ఎత్తడం లేదు.

 

టాలీవుడ్ కు చెందిన చాలామంది యంగ్ హీరోలు పెళ్లి ఊసెత్తితే.. వేరే మాటలు చెప్పి దాటేస్తున్నారు. దీంతో వీళ్లు బ్రహ్మచారులుగానే మిగిలిపోతారేమో అనే చర్చను జనాలు మొదలుపెట్టేశారు. అయితే ఈ కోవలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు టాలీవుడ్ నుండి ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన డార్లింగ్ ప్రభాస్. యంగ్ ఏజ్ లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. తనకు 43 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి గురించి మాట్లాడటం లేదు.

 

అటు స్క్రీన్ మీద ఎనర్జిటిక్ స్టార్ గా అందరినీ అలరిస్తూ వస్తున్న రామ్ పోతినేని కూడా పెళ్లి గురించి మాట్లాడటం లేదు. 34 ఏళ్ల వయసు వచ్చినా కానీ పెళ్లి ఎప్పుడు అంటే చిరునవ్వు నవ్వేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇలా అయితే పెళ్లి కష్టమే అనే కామెంట్లు వస్తున్నా రామ్ పట్టించుకోవడం లేదు. సినిమాల కోసం కష్టపడి పని చేస్తున్న రామ్ పోతినేని.. వ్యక్తిగత జీవితం గురించి మాత్రం ఫోకస్ చేయడం లేదు.

 

మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ వయసు ఏకంగా
36కు చేరినా కానీ ఇంకా పెళ్లి ఊసెత్తడం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చి ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటున్న తరుణ్ కూడా పెళ్లి చేసుకోలేదు. 42 ఏళ్లు వచ్చినా తరుణ్ ఇంకా బ్యాచిలర్ గా ఉన్నాడు. వీళ్లతో పాటు ఈ జాబితాలో విజయ్ దేవరకొండ, రాజ్ తరుణ్, సాయి శ్రీనివాస్, అఖిల్, సుశాంత్, అడవి శేష్, నారా రోహిత్ లు ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -