Tollywood: నిర్మాతల పాలిట కృష్ణ నిజంగా దేవుడు.. ఏం చేశారంటే?

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీకి సుపరిచితమైన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు సినిమా నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించారు. సీనియర్ హీరోల్లో ప్రజాదారణ పొందిన స్టార్‌గా ఎదిగాడు. సినిమాలపై ఉన్న మక్కువతో 1964లో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో కేవలం సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవారు. 1965లో ‘తేనే మనసులు’ సినిమాతో పూర్తిస్థాయి హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. మొట్టమొదటి జేమ్స్ బాండ్ మూవీ ‘గూఢచారి 116’ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు దోహదపడింది. అప్పటి నుంచి తిరుగులేని హీరోగా ఎదిగారు. దాదాపు 340కి పైగా సినిమాల్లో హీరోగా నటించారు. 1970లో నిర్మాణ సంస్థలను ప్రారంభించి దాని ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. 1983లో ప్రభుత్వ సహకారంతో కృష్ణ తన స్వంత స్టూడియో ‘పద్మాలయా స్టూడియో’ను హైదరాబాద్‌లో నెలకొల్పారు. అలాగే కృష్ణ దర్శకుడిగా 16 సినిమాలను డైరెక్ట్ చేశారు.

 

అయితే సూపర్‌స్టార్ కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో నూతన ఒరవడికి నాంది పలికాయి. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ మూవీ (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్లకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70ఎంఎం సినిమా (సింహాసనం) మంచి హిట్ టాక్ అందుకున్నాయి. ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు సులభంగా పూర్తి చేశారు. దీనికోసం మూడు షిప్టులుగా పని చేసేవారు. అయితే 1972వ సంవత్సరంలో ఏకంగా 17 సినిమాలు చేశాడు. ఒకే ఒక సంవత్సరంలో ఇన్ని సినిమాలు చేసిన తొలి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు. అయితే కృష్ణలో సినిమా చేయడానికి నిర్మాతలు, హీరోయిన్లు ఎంతో ఆసక్తి చూపేవారంట. నిర్మాతల హీరోగా మంచి మనసున్న వ్యక్తిగా సూపర్ స్టార్ కృష్ణకు పేరుంది. ఒకవేళ తాను నటించిన సినిమాలు ప్లాప్ అయితే.. ఆ నిర్మాతను తన ఇంటికి పిలిపించుకునేవారట. మళ్లీ ఓ మంచి కథను సిద్ధం చేసుకోమని, అప్పుడు ఆ సినిమాను తాను ఫ్రీగా చేస్తానని భరోసా ఇచ్చేవారట. ఇచ్చిన మాట ప్రకారమే.. తన మాటను కూడా నిలబెట్టుకునే హీరో అని నిర్మాతలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -