Tollywood: సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోల వార్.. అసలేమైందంటే?

Tollywood: సంక్రాంతి అంటే సరదాలు, పిండివంటలు, కోడిపందాలతో పాటు సినిమాలు కూడా. సంవత్సరం అంతా కష్టపడిన ప్రజలు ఆ వారం రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటారు. అందుకే కోడిపందాలు, ఎడ్ల పందాలతో పాటు సినిమాలు కి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకే ఈ సీజన్ ని క్యాష్ చేసుకోవాలనుకుంటారు మూవీ మేకర్స్. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా తమ సినిమాని సంక్రాంతి బరిలో దింపాలని తాపత్రయపడతారు. అయితే అటువంటప్పుడు థియేటర్స్ ఇష్యూ కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది.

 

ఈ సంవత్సరం సంక్రాంతికి పోటీలోంచి కేవలం ధియేటర్ల సమస్య కారణంగా చాలా సినిమాలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అందుకే వచ్చే ఏడాది పండగ రిలీజ్ కోసం ఇప్పటినుంచి నిర్మాతలు డేట్లు అనౌన్స్ చేసి ముందే బుక్ చేసుకుంటున్నారు. 2025 సంక్రాంతి బరిలో చిరంజీవి విశ్వంబర సినిమాతో రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.

అలాగే వచ్చే సంక్రాంతికి శతమానంభవతి సీక్వెల్ తో వస్తాను అని దిల్ రాజు ఆల్రెడీ పోస్టర్ కూడా రిలీజ్ చేసేసారు.ఇక నాగార్జున కూడా సంక్రాంతి బరిలో నిలవాలని చూస్తున్నారు. గతంలో సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు సినిమాలతో సంక్రాంతికి వచ్చి హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. అందుకే ఆ ఛాన్స్ ని నాగార్జున ఎట్టి పరిస్థితుల్లోని వదులుకోడు. లేటుగా అయినా సినిమా అనౌన్స్ చేసి సంక్రాంతి బరిలో నిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు.

 

ఇక బాలకృష్ణ విషయానికి వస్తే బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నాడు. ఇది దసరాకి రిలీజ్ అని చెప్పారు కానీ లేట్ అయితే ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉండొచ్చు. వీటితోపాటు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మూవీ కూడా సంక్రాంతి బరిలో ఉంటుంది. ఇంకా చిన్న సినిమాలు ఎన్ని ఎనౌన్స్ చేస్తారో ఇంకా ఎన్ని పోటీలో దిగుతాయో చూడాలి. మొత్తానికి వచ్చే సంవత్సరం సంక్రాంతి సినిమాలు కూడా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -