Tollywood: పుట్టుమచ్చ చూపించి కవ్వించిన హీరోయిన్.. ఏమైందంటే?

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడంతా హీరోయిన్ల టైం అని అనిపిస్తోంది. హీరోలకంటే ఎక్కువగా హీరోయిన్లు ఉన్నారు. కొత్త వారు వస్తూ ఉన్నారు. పాత హీరోయిన్లు కనుమరుగవుతూ ఉన్నారు. ఇండస్ట్రీలో తమకంటూ కొందరు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. అయితే తాజాగా అవకాశాల కోసం హీరోయిన్లు తమ అందచందాలను ఎర వేస్తున్నారు. వాటి ద్వారా మరిన్ని సినిమాల్లో అవకాశాలను వారు పొందుతున్నారు.

 

బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తలపతి విజయ్ ‘మాస్టర్’ ఫిల్మ్ లో ఆమె కథానాయికగా కనిపించారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈమె తన ఫ్యాన్స్ తో అనేక విషయాలను తెలుపుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్, లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫేవరెట్ ఫ్లవర్స్ తో దిగిన ఫొటో ను మాళవిక షేర్ చేసి వార్తల్లో నిలిచింది. ఆ ఫొటోలో చక్కగా నవ్వుతూ ఉన్న మాళవిక మోహనన్ వైట్ కలర్ డ్రెస్సులో మెరుస్తోంది. తన బ్యాక్ ను చూపిస్తూనే తన నడుముపైన ఉన్న పుట్టు మచ్చను చూపుతూ కుర్రకారు మనసుల్లో సెగలు రేపుతోంది.

 

మాళవిక షేర్ చేసిన ఫొటోను చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పుట్టు మచ్చ బాగుంది, బ్యూటిఫుల్, వావ్, హాటెస్ట్, ఆసమ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆస్క్ మాళవిక హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్లతో ఆమె ముచ్చటించారు. హీరో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయాలని ఉందని తన మనసులో మాటను మాళవిక బయటపెట్టడం విశేషం.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -