Tollywood: డబ్బింగ్ సినిమాకి వచ్చిన పేరు స్ట్రెయిట్ సినిమాకి రాలేదా?

Tollywood: పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది ప్రస్తుతం ఇండియాలో. మంచి చిత్రాన్ని అన్ని భాషల్లో ప్రేక్షకులకు అందిస్తున్నారు ఈ ట్రెండ్ తో. బాహుబలి తో మొదలైన ఈ ట్రెండ్ కే. జి.ఎఫ్, ఆర్ ఆర్ ఆర్ తో మరింత ప్రాచుర్యం పొందింది. ఇదే కోవలో వచ్చిన ఒక చిన్న చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చరిత సృష్టించింది.

కాంతార కి ఇలా మరో చిత్రానికి అలా!

కన్నడ చిత్రం కాంతార చేసిన సందడి అంతా ఇంతా కాదు. కన్నడనాటే కాకుండా విడుదలైన ప్రతిచోట కలెక్షన్ల వరద పారించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు Rs 400 కోట్లు వసూలు చేసింది అని చెప్తున్నారు. సినిమా బడ్జెట్ తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. దర్శకుడు తను చెప్పదలుచుకున్న విషయాన్ని మనసుకి హత్తుకునేలా చెప్పాడు.

చాలా మంది సినిమా ప్రేమికులు ఒక చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు. దాన్ని కాంతార తో కూడా పోలుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే రెండు చిత్రాలు కూడా గూడెం వాసుల గురించే. ఊరికి పెద్దగా వ్యవహరించే ఒక దొర కూడా ఒక సారుప్యత. ఒక కన్నడ చిత్రానికి లభించిన విజయం స్ట్రయిట్ చిత్రానికి ఎందుకు లభించలేదు అంటున్నారు నెటిజన్లు.

గత సంవత్సరం ‘ఆకాశవాణి’ అనే తెలుగు చిత్రం విడుదలయ్యింది ఓటీటీ లో. కన్నడ చిత్రం లాగానే తెలుగు చిత్రం కూడా గూడెం వాసులకి సంబంధించిన కథ. ఊరు పెద్దని దేవుడుగా భావించే గూడెం వసూల జీవితాలు రేడియో ద్వారా ఎలా మారాయి అనేది కథ. అయితే కాంతార లాగా ప్రమోట్ చేయకపోవడం,ఆ చిత్రంలో ఉన్నట్టు దైవిక అంశాలు ఆకాశవాణి లో లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు ‘ఆకాశవాణి’ చిత్రాన్ని తీశారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -