Trisha: త్రిషకు మూడ్ వచ్చిందట.. దానికి రెడీ అయిందట!

Trisha: సీనియర్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం సినిమాతో పాటు పర్సనల్ లైఫ్ పై కూడా దృష్టి పెట్టింది. సినిమాల్లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం ఆ క్రేజ్ ను ఇంకా కొనసాగిస్తోంది. అయితే త్రిష పర్సనల్ లైఫ్ లో అన్నీ వివాదాలే. ఎంతోమందితో ప్రేమాయణం నడిపింది. కొంతమందితో నిశ్చితార్థం వరకు వెళ్లి పెళ్లి ఆగిపోయింది. అయితే ఈ బ్యూటీ మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

తనకు నచ్చిన అబ్బాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని త్రిష చెబుతోంది. తాను స్టేటస్ ను చూడనని, అబ్బాయి మెంటాలిటీ, పర్సనాలిటీ మాత్రమే చూస్తానని ఈ అమ్మడు చెబుతోంది. ప్రస్తుతం త్రిషకు 40 ఏళ్లకుపైగా ఉంటాయి. ఈ వయస్సులో పెళ్లి ఏంటి అంటూ కొంతమంది కామెంట్లు చేస్తోన్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని తన స్నేహితుల వద్ద త్రిష చెప్పిందట. దీంతో త్రిష పెళ్లి త్వరలోనే ఉంటుందని కోలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది త్రిష. కొద్దిరోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అందాల భామ.. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పోనియన్ సెల్వవ్ తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఐశ్వర్యరాయ్ నటించినా.. ఆమెను మించి త్రిష మంచి పేరు తెచ్చుకుంది. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

త్వరలోనే త్రిష పెళ్లి

అందులో కుందవై దేవి పాత్రలో త్రిష నటించింది. ఆ తర్వాత త్రిషకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే వ్యక్తిగత జీవితంపై కూడా త్రిష దృష్టి పెట్టింది. పెళ్లి చేసుకోవాలని త్రిష నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో త్వరలోనే ఆమె పెళ్లి ఉంటుందని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -