Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీవితాన్ని నాశనం చేస్తున్న త్రివిక్రమ్.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పవన్ కళ్యాణ్ సొంతంగా ఒక పార్టీనిపెట్టారు అంటే అది కేవలం సినిమాల వల్ల వచ్చిన ఫాలోయింగ్ వల్ల మాత్రమే అని చెప్పవచ్చు. కానీ ఆ ఫాలోయింగ్ ఇచ్చిన సినిమాలను మాత్రం పాడుచేసుకుంటున్నారు. సరైన మిత్రుడు అంటే చేదు అయినా మంచి సలహా ఇవ్వాలి. అంతే తప్ప బద్దకం నేర్పకూడదు. కానీ పవన్ విషయంలో అదే జరిగినట్లు, జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

 

2008 లో జల్సా వచ్చిన తరువాత పులి,తీన్ మార్, పంజా అనే మూడు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. తరువాత 2012 గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. తరువాత కెమెరామాన్ గంగతో రాంబాబు, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. తరువాత వచ్చిన గోపాల గోపాల యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా హిట్ ఫ్లాప్ గానే నిలిచాయి. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక పవన్ మళ్లీ సినిమాలు స్టార్ట్ చేసారు. 2021 లో వకీల్ సాబ్, 2022 లో భీమ్లా నాయక్, ఇప్పుడు బ్రో. మూడు సినిమాలు కూడా హడావుడి ఎక్కువే తప్ప రికార్డులు ఏమీ క్రియేట్ చేయలేదు. వీటిలో పక్కా కమర్షియల్ సినిమా భీమ్లా నాయక్ మాత్రమే. ఆ సినిమా కూడా నైజాంలో 30 కోట్లకు బాగా కిందకే.

అయితే పవన్ ఏ సినిమాలు చేయాలి. ఏ సినిమాలు వద్దు అన్నవి అన్నీ ఇప్పుడు ఆయన ఆప్తుడు, స్నేహితుడు అయినా త్రివిక్రమ్ నే చూసుకుంటున్నారు. వకీల్ సాబ్ సినిమాను సెట్ చేసింది త్రివిక్రమ్ నే. భీమ్లా నాయక్ సినిమాకు అన్నీ తానై వ్యవహరించారు. ఇలా పవన్ సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలను త్రివిక్రమ్ దగ్గర ఉండి చూసుకుంటున్నారు. త్రివిక్రమ్ ప్రమేయం లేని హరి హర వీరమల్లు, ఉస్తాద్ సినిమాలు అలా పక్కన పడి వున్నాయి. నిజానికి ఈ రెండు సినిమాలే ఫ్యాన్స్ కు అసలు సిసలు ఆకలి తీర్చేవి. కానీ ఇవి మాత్రం ముందుకు కదలడం లేదు. ఎందుకంటే అక్కడ పవన్ సమస్య కూడా వుంది. పెద్ద హీరోలు పెద్ద సినిమా చేయాలంటే కనీసం 90 నుంచి 100 రోజులు అవసరం పడతాయి. కానీ పవన్ అలా చేయడానికి ఇష్టపడడం లేదు.

 

ముఫై రోజులకు మించి చేయడం లేదు. పాటలు, ఫైట్లు వద్దంటున్నారు. డ్యాన్స్ లు చేయడం లేదు. బ్రో సినిమాలో ఫైట్ సీక్సెన్స్ లో పవన్ కూడా చేయాల్సి వుంది. కానీ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ కొట్టారు. అలాగే సాంగ్ కూడా సగం రోజు అంటే ఒక పూట లో కానిచ్చేయమన్నారు. హరి హర వీరమల్లు సినిమా యాజ్ టీజ్ చేస్తే ఓ రేంజ్ సినిమా. పాటలు, ఫైట్లు ఒకటి కాదు. కానీ పవన్ ఆ స్క్రిప్ ను మొత్తం మార్పించారని, పాటలు, ఫైట్లు చాలా వరకు కోసేసారని ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా హరీష్ శంకర్ టైప్ ఫక్తు మాస్ కమర్షియల్ సినిమా. కానీ వంద రోజులు డేట్స్ ఇవ్వాలి. త్రివిక్రమ్ చాలా సులువుగా ఆదాయం వచ్చే పద్దతి కనిపెట్టారు. తనకీ, పవన్ కు ఇద్దరికీ కలిసి వచ్చేలా.

 

సింపుల్ గా ఇరవై ముఫై రోజులు డేట్ లు ఇవ్వడం, 60 కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ అందుకోవడం. ఒళ్లు అలిసిపోకుండా, పాటలు, ఫైట్లు లేకుండా, అలా అలా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి, అటు ఇటు నడిచి వదిలేయడం. త్రివిక్రమ్ కూడా సినిమాలు సెట్ చేసినందుకు ఎంతో కొంత ప్రమేయం చూపించి, తన ఆదాయం తాను అందుకోవడం. లేటెస్ట్ సినిమా ఓజి కూడా త్రివిక్రమ్ సెట్ చేసినదే. ఈ సినిమా వెనుక కూడా త్రివిక్రమ్ కమిట్ మెంట్లు, ఆర్థిక లావాదేవీలు వున్నాయనే గుసగుసలు వున్నాయి. అలా పవన్ కళ్యాణ్ పాలిట త్రివిక్రమ్ శాపం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -