Bhuvaneswari: నిజం గెలవాలంటే భువనేశ్వరి చేయాల్సిన పని ఇదే.. అలా చేయడం ఆమెకు సాధ్యమా?

Bhuvaneswari: చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత బాధతో వందలాది మంది ప్రాణాలు పోయాయని తెదేపా వర్గం వారు చెప్పుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం కోసం భువనేశ్వరి నిజం గెలవాలి అనే కార్యక్రమం ద్వారా ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు. అయితే నిజం గెలవాలి అనే పేరే కాస్త అతిగా ఉందంటున్నారు నెటిజన్స్. అవినీతి కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకి శిక్ష పడితే నిజం గెలిచినట్లు అవుతుందని, ఆయన బయటకు వస్తే నిజం గెలిచినట్లు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.

నిజం గెలవాలి అనే టైటిల్ మీద తెగ ట్రోలింగ్ జరుగుతుంది. నిజాలు గురించే మాట్లాడవలసి వస్తే అమరావతి కాంట్రాక్టర్ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరికి ఇచ్చానని కాంట్రాక్టర్ షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు కదా ఆ నిజం చెప్పండి, రెండు ఎకరాల ఆసామీ 2 లక్షల కోట్లకు యజమాని ఎలా అయ్యాడో చెప్పండి అంటూ భువనేశ్వరి మీద సెటైర్లు వేస్తున్నారు.నిజం గెలవాలంటే చంద్రబాబు కోర్టులో నిజం చెప్పాలి.

చంద్రబాబు అబద్ధం చెప్పినంత కాలం నిజం ఎలా గెలుస్తుంది అంటూ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్స్. నిజానికి ఈ కార్యక్రమం బాలకృష్ణ మొదలుపెడతానన్నారు కానీ ఆయనకు ఆ చాన్సివ్వకుండా నారా వారి కుటుంబమే రంగంలోకి దిగింది. పరామర్శల పేరుతో రాజకీయం మొదలుపెట్టింది. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆవేదనతో 105 మంది పార్టీ కార్యకర్తలు అభిమానులు మృతి చెందారని ఎల్లో మీడియా ప్రచురించింది. ఆ కుటుంబాలని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు భువనేశ్వరి బయలుదేరుతున్నారు.

చంద్రబాబు అంత త్వరగా జైలు నుంచి వచ్చే అవకాశం కనిపించకపోవడం, ఒకవేళ వచ్చిన మునుపటిలాగా యాక్టివ్గా ఉండలేరు అని ఒక నిర్ణయానికి వచ్చేసారు తెదేపా నాయకులు. అందుకే ఆయన స్థానంలో భువనేశ్వరిని తీసుకువచ్చారు. భువనేశ్వరి యాత్రలో వర్కౌట్ కాకపోతే బ్రాహ్మణి అస్త్రం ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు తెదేపా వర్గం వారు. బ్రాహ్మణి ఎందుకంటే లోకేష్ పాదయాత్రలకు ఏమాత్రం స్పందన వచ్చిందో, అతని కెపాసిటీ ఏమిటో ఈపాటికి అర్థం అయిపోయింది అందుకే లేడీస్ సెంటిమెంట్ ని వాడుకోవాలనుకుంటుంది టీడీపీ.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -