TRS: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 95 సీట్లు.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

TRS: వచ్చే ఎన్నికలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్దమవుతోన్నారు. నేతలను ఇప్పటినుంచే ఎన్నికల కోసం సిద్దం చేస్తోన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ను ఎదుర్కొని మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా 10 నెలలు మాత్రమే సమయం ఉండటంతో కేసీఆర్ వ్యూహలకు మరింత పదును పెడుతున్నారు. ఇప్పటినుంచే పావులు కదుపుతోన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ దే గెలుపు అనే ధీమాతో కేసీఆర్ ఉన్నారు.

 

తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్ధాయి సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ దే గెలుపు అని, 95 సీట్లతో టీఆర్ఎస్ గెలుస్తుందంటూ జోస్యం చెప్పారు. మూడోసారి కూడా టీఆర్ఎస్ వస్తుందని చెప్పడమే కాకుండా ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా కేసీఆర్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. పలు సర్వేలు చేయించానని, వచ్చే ఎన్నికల్లో కూడా టీఆఎస్ దే గెలుపు అని తేలిందంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు తనకు రిపోర్టులు వస్తున్నాయని, పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు.

 

మంత్రులందరూ మరో ఎమ్మెల్యేలను గెలిపించే విధంగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. మంత్రులు తమ నియోజకవర్గమే కాకుండా రాష్ట్రమంతా పర్యటించాలని స్పష్టం చేశారు. మంత్రులు రాష్ట్రమంతా తిరిగి అభివృద్ది పనుల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇక నియోజకవర్గాలపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని, నిరంతరం ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసి ప్రజల నుంచి సానుభూతి పొందాలని టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచించారు. ప్రస్తుతం సర్వే రిపోర్టులన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయని, ఇప్పటినుంచే అంరదూ జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ తెలిపారు.ఎమ్మెల్యలు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తే వచ్చే ఎన్నికల్లో మనకు తిరుగు ఉండదని కేసీఆర్ చెప్పారు. ఇప్పటినుంచే అలసత్వం వద్దని, నియోజకవర్గాల్లోనే ఉండాలని సూచించారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -