Tummala Nageswara Rao : తుమ్మల నాగేశ్వరరావు బీజేపీ ఎంట్రీ ఎప్పుడు?

Tummala Nageswara Rao : తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు. టీడీపీలో సీనియర్ నేతగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ కేసీఆర్ వెంటే ఎప్పుడూ ఉండేవారు. కేసీఆర్ కు నమ్మకస్తుడిగా పేరు సంపాదించుకున్నారు. తెలంగాణలో కమ్మ సామాజికవర్గం తరపున సీనియర్ నేతగా టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరావుకు ఒకప్పుడు జిల్లానే శాసించారు. ఏకచత్రాధిపత్యంతో జిల్లాలను ఏలారు. జిల్లా రాజకీయాల్లో ఆయన చెప్పిందే వేదంగా ఒకప్పుడు సాగింది. ఖమ్మం జిల్లా రాజకీయాలను కంటి చూపుతో ఏలారు ఒకప్పుడు.

కానీ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఆధిపత్యానికి తెరపడింది. గత ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ కూడా ఆయనను పట్టించుకోవడం మానేశారు. ఒకప్పుడు తుమ్మల తన వెంట తిప్పుకునే కేసీఆర్.. ఇప్పుడు ఆయనను పూర్తిగా పక్కన పెట్టేశారు. టీఆర్ఎస్ అధిష్టానం కూడా ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. నామినేటెడ్ పోస్టులు లాంటివి కూడా ఎలాంటివి ఇవ్వడం లేదు. దీంతో పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడంతో తుమ్మల సైలెంట్ అయ్యారు. దీంతో జిల్లా రాజకీయాల్లో మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు.

ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలు కూడా జిల్లా రాజకీయాల్లో ఆధిప్యతం చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తుమ్మల మరింత వీక్ అయ్యారు. పువ్వాడ, పొంగులేటి, తుమ్మల మధ్య ఖమ్మం జిల్లాలో రాజకీయాల్లో కోల్డ్ వార్ నడిస్తుంది. ముగ్గురి నేతల మధ్య విబేధాలతో జిల్లాలో టీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగై అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ పలుమార్లు సమావేశాలు నిర్వహించి ముగ్గురు నేతల మధ్య సమన్వయం కల్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఈ ముగ్గురి నేతల మధ్య సమన్వయ లోపం, విబేధాలు మరింత ఎక్కువైపోతున్నాయి.

దీంతో టీఆర్ఎస్ అధిష్టానం కూడా ఏం చేయలేని పరిస్ధితి ఏర్పడింది. పై పెచ్చు తమ్మల, పొంగులేటి ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి రాజ్యసభ సీటును ఆశించారు. కానీ కేసీఆర్ ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. గత ఎన్నికల్లో పొంగులేటికి కాదని నామా నాగేశ్వరరావుకు ఖమ్మం లోక్ సభ సీటు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ ఖమ్మం లోక్ సభ సీటు నామాకే కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీకి పోటీ చేసేందుకు పొంగులేటి ఆసక్తి చూపడం లేదు.

ఈ కారణాల వల్ల టీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పే ఆలోచనలో పొంగులేటి ఉన్నారు. ఇక తుమ్మల నాగేశ్వరరావుకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడంతో పార్టీ మారే యోచనలో ఉన్నారు. బీజేపీలో చేరేందుకు ఆయన ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీలో చేరితో సముచిత స్థానం కల్పిస్తామని కమలం నేతలు ఆపర్లు ఇస్తున్నారు. దీంతో కాషాయం వైపు మళ్లేందుకు తుమ్మల అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అనుచరులతో పార్టీ మారే విషయంపై చర్చిస్తున్నారు.

టీఆర్ఎస్ లో ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అనుచరులు కూడా పార్టీ మారాలని ఒత్తిడి తీసుకోస్తున్నారట. దీంతో తుమ్మల త్వరలో టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమని ఖమ్మం జిల్లా పాలిటిక్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలో బీజేపీ కండువా కప్పుకుంటారని ఖమ్మం జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -