Munugode By-Poll: మునుగోడు ఉపఎన్నిక క్రమంలో కేసీఆర్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ ఎంపీ

Munugode By-Poll: మునుగోడు ఉపఎన్నిక వేళ టీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత కేసీఆర్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీలో చేరేందుకు ఆయన రంగం సిద్దం చేసుకుంటున్నారని, ఇప్పటికే కాషాయ నేతలతో మంతనాలు జరిపినట్లు టాక్ నడుస్తోంది. బీజేపీ అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, రేపో, మాపో ఆయన కమలం గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోందంటూ ఊహాగానాలు హల్‌చల్ చేస్తోన్నాయి. కీలకమైన బీసీ నేతగా ఉన్న ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక సమయంలో పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేయడం గులాబీ వర్గాలను కలవరపెడుతోంది.

ఇంతకు ఆయన ఎవరో కాదు.. భువనగిరి టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. మునుగోడు ఉపఎన్నికలో ఆయన టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. టికెట్ కోసం ఆయన కేసీఆర్ దగ్గరకు వెళ్లి ప్రయత్నాలు చేశారు. బీసీ నేతగా ఉన్న తనకు టికెట్ ఇవ్వాల్సిందిగా కేసీఆర్ పై ఒత్తిడి తీసకొచ్చారు. కానీ ఆయనను కాదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే కేటీఆర్ టికెట్ కేటాయించారు. కూసుకుంట్లకు టికెట్ దక్కడంతో జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మంత్రాంగం పనిచేసింది. మునుగోడు ఉపఎన్నికల ఇంచార్జ్ గా ఉన్న జగదీష్ రెడ్డి సూచనతోనే కూసుకుంట్లకే కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో బూర నర్సయ్యగౌడ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

బూర నర్సయ్యగౌడ్‌కు టికెట్ ఇవ్వడమే కాకుండా ఆయనను అసలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా దూరంగా ఉంచుతున్నారు. పార్టీ సమావేశాలకు కూడా ఆయనను అసలు ఆహ్వానించడం లేదట. పార్టీలోని వర్గ పోరు వల్ల బూర నర్సయ్య గౌడ్‌ను జగదీశ్వర్ రెడ్డి కనీసం పార్టీ సమావేశాలకు కూడా పిలవకుండా అవమానిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్‌లో తనపై జరుగుతున్న పరిణామాలపై ఆవేదనలో బూర నర్సయ్యగౌడ్ ఉన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రగతిభవన్ కు పిలిపించి బుజ్జగించారు. మునుగోడు టికెట్ అంశంపై ఆయనను శాంతింపజేశారు. అయినా పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కకపోవడంపై బూన నర్సయ్యగౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

దీంతో గురువారం తన అనుచరులతో కలిసి నర్సయ్యగౌడ్ ఢిల్లీ బయలుదేరారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లతో ఆయన సమావేశమయ్యారు. మరో రెండు రోజుల్లో బూర నర్సయ్యగౌడ్ బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఆయనతో పాటు జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశముంది. బూర నర్సయ్యగౌడకు వచ్చే ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన చేరిక మునుగోడులో బీజేపీకి కలిసొస్తుందని కమల వర్గాలు భావిస్తున్నాయి. అయితే బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరితే మునుగోడులో టీఆర్ఎస్ కు షాక్ తగిలినట్లు అవుతుంది. బీసీ సామాజికవర్గ ఓటర్లు టీఆర్ఎస్ కు దూరమయ్యే అవకాశం ఉంటుంది. మునుగోడులో బూర నర్సయ్య గౌడ్ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -