Palle Ravi: బూర నర్సయ్యగౌడ్ షాక్‌తో టీఆర్ఎస్ అప్రమత్తం.. పల్లె రవికి నామినేటెడ్ పోస్ట్?

Palle Ravi: భువనగిరి మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత బూర నర్సయ్యగౌడ గులాబీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా టీఆర్ఎస్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. శనివారం ఆ పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు. టీఆర్ఎస్‌కు ఆయన అనూహ్యంగా రాజీనామా చేయడం గులాబీ వర్గాలను షాక్‌కు గురి చేస్తోంది. మునుగోడు ఉపఎన్నిక క్రమంలో నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ రాజీనామా చేయడంతో టీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అది కూడా గౌడ సామాజికవర్గ నేత కావడం, మునుగోడులో గౌడ సామాజికవర్గానికి చెందిన ఓటర్ల ఎక్కువ ఉండటంతో ఊహించని ఈ పరిణామం టీఆర్ఎస్ వర్గాలను కలవరపెడుతోంది.

మునుగోడులో టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడం, పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో టీఆర్ఎస్ కు బూర నర్సయ్యగౌడ్ వీడారు. అయితే ఆయన పార్టీని వీడటంతో మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డ ఇతర అసంతృప్త నేతల విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. మునుగోడు ఉపఎన్నిక సమయంలో మిగతా అసంతృప్త నేతలు కూడా పార్టీ వీడితే నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. అందుకే మిగతా అసంతృప్ నేతలకు కీలక పదవుల కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బీసీ వర్గానికి చెందిన పల్లె రవి దంపతులను తమ పార్టీలో టీఆర్ఎస్ చేర్చుకుంది. పల్లె రవికి నామినేటెడ్ పదవి ఇస్తామంటూ హామీ ఇచ్చినట్లు సమాచారం.

బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ ను వీడటంతో మునుగోడులో బీసీ సామాజికవర్గ ఓటర్లు కొంతమంది పార్టీకి దూరమయ్యే అవకాశముందనే అభిప్రాయానికి వచ్చింది. అందుకే బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు పల్లె రవిని పార్టీలో చేర్చుకుంది. ఇక బూర నర్సయ్యగౌడ్ నేడో, రేపో కాషాయ కండువా కప్పుకునే అవకాశముంది. బీజేపీలో చేరిన అనంతరం మునుగోడులో బీసీ ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేసే అవకాశముంది. మునుగోడులో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తోన్న బీజేపీ.. బీసీ ఓటర్ల కోనం నర్సయ్యగౌడ్ ను పార్టీలో చేర్చుకుంది. దీంతో ఆయనతో ఖచ్చితంగా ప్రచారం చేయించే అవకాశముంది.

అందుకే బీసీ ఓటర్ల తమ పార్టీ నుంచి చేజారిపోకుండా ప్రచార తీరు మార్చాలని పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మునుగోడు సెగ్మెంట్ లో 1.50 లక్షల బీసీ ఓటర్లు ఉన్నారు. దీంతో వాళ్లు బీజేపీ మళ్లకుండా చూడాలని ఆదేశించినట్లు సమాచారం. బీసీ సంక్షేమ పథకాల నుంచి ప్రచారం చేయాలని, బీసీలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేయాలని పార్టీ నేతలకు సూచించారు. గొల్ల కురుములకు అమలు చేస్తోన్న గొర్ల పంపిణీ, చేనేతల కోసం అమలు చేస్తున్న పథకాలు, ముదిరాజులకు చేప పిల్లల పంపిణీ లాంటి పథకాలను వివరించాలని కేసీఆర్ సూచించారు.గ్రామాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేయాలని, బీసీ ఓటర్లతో సమావేశమై వారికి కోసం అముల చేస్తున్న పథకాల వివరాలను తెలియజేయాలని కేసీఆర్ టీఆర్ఎస్ నేతలను అదేశాలు జారీ చేశారు బూర నర్సయ్యగౌడ్ మునుగోడు ఉపఎన్నికల సమయంలో ఇలా సడెన్ షాక్ ఇస్తారని టీఆర్ఎస్ ఊహించలేదు. గురువారం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ రోజు సాయంత్రమే ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలతో పార్టీలో చేరికపై చర్చలు జరిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -