TRS-BJP: బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా మారిన పాలిటిక్స్.. రేవంత్ కు ఇక ఇబ్బందులేనా?

TRS-BJP: తెలంగాణ రాజకీయం రసకందాయంగా మారింది. పాలిటిక్స్ లో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటివరకు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్న రాజకీయం.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. 10 రోజుల్లోనే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది. కాంగ్రెస్ కనుచూపు మేరల్లో కూడా కనిపించడం లేదు. ఒక్కసారిగా టీ కాంగ్రెస్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. సీనియర్ నేతలు కొందరు అడపాదడపా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం తప్పితే.. టీపీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాస్త దూకుడు తగ్గించారు. టీఆర్ఎస్ సర్కార్ పై విరుచుకపడే ఆయన.. గత కొద్దిరోజులుగా స్పీడ్ తగ్గించారు. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు, సీనియర్ నేతల మధ్య సయోధ్య కుదరకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంతో టీ పాలిటిక్స్ వాడివేడీగా మారాయి. లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు కవిత పాత్ర ఉందని ఢిల్లీలోని బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో చిచ్చురేపాయి. కవిత ఇంటిని బీజేపీ నేతలు ముట్టడించడం, ఆమె ఇంటి ముందు ఆందోళన చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో బీజేపీ వర్గాలు భగ్గమున్నాయి. దీనిని నిరసిస్తూ పాదయాత్రలో ధర్నాకు దిగిన బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం, ఆయన పాదయాత్రకు పర్మిషన్ నిలిపివేయడం మరింత రచ్చకు దారి తీసింది. ఇది జరుగుతుండగానే మునావర్ షోకు కేటీఆర్ అనుమతి ఇచ్చారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు, మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ వీడియో విడుదల చేసిన రాజాసింగ్ ను అరెస్ట్ చేయడం కలకలం రేపింది.

రాజాసింగ్ పై గతంలో నమోదైన రౌడీ షీట్లకు సంబంధించి ఇప్పుడు పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పరిణామాలన్నింటితో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా రాజకీయం జరుగుతోంది. కాంగ్రెస్ ను సైడ్ చేయడం వెనుక బీజేపీ, టీఆర్ఎస్ వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తరహాలో టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ ను బీజేపీ దెబ్బకొట్టిందని, అదే విధంగా టీఆర్ఎస్ కు కూడా చెక్ పెడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం ద్వారా ప్రజల్లో బీజేపీ వర్సెస్ కేసీఆర్ గానే చర్చ జరుగుతుందని, కాంగ్రెస్ వార్తల్లో లేకుండా పోతుందనేది కాషాయ పార్టీ ప్లాన్ గా తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉంది. ఇలాంటి తరుణంలో బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగానే రాజకీయాలు నడుస్తున్నాయి. దీని వల్ల కాంగ్రెస్ ను దెబ్బతీయాలనేది టీఆర్ఎస్ ప్లాన్. దీంతో కాంగ్రెస్ ను దెబ్బకొట్టంతో బీజేపీ, టీఆర్ఎస్ వ్యూహలు సక్సెస్ అయినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీ, టీఆర్ఎస్ మైంగ్ గేమ్ తో కాంగ్రెస్ గురించి ప్రజల్లో చర్చ జరగడం లేదు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ గానే రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీలోని విబేధాలు, సీనియర్ నేతలు సహకరించకపోవంతో రేవంత్ రెడ్డి కూడా సైలెంట్ గా ఉన్నారు. ఇంతకుముందులా యాక్టివ్ గా ఉండటం లేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంతో కాంగ్రెస్ పాలిటిక్స్ విబేధాలతో సతమతమవుతోంది. దీంతో ప్రజల్లో ఆ పార్టీపై చులకన భావం ఏర్పడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -