Ponguleti Srinivas Reddy: ఆ పార్టీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జంప్?

Ponguleti Srinivas Reddy: టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వరుసలు మొదలవుతున్నాయి. ఇప్పటికే కొంతమంది నేతలు టీఆర్ఎస్ లో సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో కాషాయ కండువా కప్పుకున్నారు. మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత ఆయనతో టీఆర్ఎస్ లో సంబంధం ఉన్న నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. తనకు ఉన్న పరిచయాలతో టీఆర్ఎస్ లోని నేతలను కలిసి బీజేపీలో చేరాలని సూచిస్తున్నారు. కొంతమంది నేతలు వచ్చేందుకు సిద్దంగా ఉన్నా ఇప్పటికిప్పుడు వచ్చేందుకు రెడీగా లేరు. ఎన్నికలకు ముందే చేరుతామని చూస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి సీటుపై ఎలాంటి హామీ రాకపోతే బీజేపీలో చేరేందుకు కొంతమంది నేతలు సిద్దమవుతున్నారు.

ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి ఓ ముఖ్యనేత బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నారనే వార్త వినిపిస్తోంది. దీంతో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలనుందనే వార్త రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ముఖ్యనేతగా పొంగులేటి శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. ఖమ్మం మాజీ ఎంపీగా ఆయన పనిచేశారు. వైసీపీ తరపున 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా ఆయన గెలుపొందారు. ఆయన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఖమ్మం అభ్యర్ధిగా ఆయనకు సీటు దక్కలేదు. ఖమ్మం ఎంపీ సీటును నామా నాగేశ్వరరావుకు కేసీఆర్ ఇచ్చారు.

దీంతో అప్పుడే పొంగులేటి శ్రీనివాసులురెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరుతారనే వార్తలు వచ్చాయి. కానీ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ లోనే ఉండి నాగా నాగేశ్వరరావుకు తన మద్దతు తెలిపారు. కానీ పొంగులేటికి నామినేటెడ్ పదవులు ఏమైనా దక్కుతాయోనని ఆయన అనుచరులు ఆశించారు. కానీ ఆయనకు ఎలాంటి నామినేటెడ్ పదవులు ఇప్పటివరుకు దక్కలేదు. ఇటీవల రాజ్యసభ ఎన్నికలు జరగ్గా.. పొంగులేటికి రాజ్యసభ పదవి ఇస్తారేమోనని అందరూ భావించారు.

కానీ ఆయనకు రాజ్యసభ పదవి దక్కలేదు. దీంతో పార్టీ మారాలని ఆయన అనుచరులు పొంగులేటిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. టీఆర్ఎస్ లో సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరాలని పొంగులేటిపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారట. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ పార్టీలోకి రావాల్సిందిగా ఆయనను ఆహ్వాస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండటంతో, బీజేపీ పుంజుకోవడంతో కాషాయ పార్టీలో చరేందుకు పొంగులేటి ఆసక్తి చూపుతున్నారట.

పొంగులేటి తర్వరలో బీజేపీలో చేరడం ఖాయమని చెబుతున్నారు, వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అంటున్నారు. ఇటీవల ఆయన కూతురు వివాహ రిసప్షన్ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికని టీఆర్ఎస్ నేతలెవ్వరూ హాజరుకాలేదు. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ హాజరయ్యారు. బీజేపీ నేతలు కడా చాలామంది ఈ ఫంక్షన్ కు వచ్చరు. టీఆర్ఎస్ నేతలు ఒక్కరూ కూడా హాజరుకాలేదు.

టీఆర్ఎస్ నేతలు ఒక్కరూ కూడా హాజరుకాలేదు. దీంతో పొంగులేటి టీఆర్ఎస్ కు దూరమయ్యారని తెలుస్తోంది. త్వరలో ఆయన బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -