Munugode By-Poll: మునుగోడులో మా పార్టీ ఓడిపోతే రాజీనామా చేస్తా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Munugode By-Poll: మునుగోడు ఉపఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉపఎన్నికల ప్రచారానికి టైమ్ ఉండటంతో పార్టీలన్నీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తోన్నాయి. అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలందరూ మునుగోడులోనే మకాం వేశారు. తమ పార్టీల గెలుపు కోసం కృషి చేస్తోన్నారు. గ్రామగ్రామన, ఇంటింటికీ ప్రచారం చేస్తోన్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రచారంలోనే గడుపుతూ అన్ని పార్టీల నేతలందరూ బిజీబిజీగా ఉంటున్నారు. ఇక ఇప్పటిరవకు పార్టీల నేతలు, కార్యకర్తలు మాత్రమే ప్రచారంలో పాల్గొంటుండగా.. పార్టీల అధినేతలు మాత్రం ఇంకా రంగంలోకి దిగలేదు.

అయితే మరో రెండు రోజుల్లో పార్టీల అధినేతలందరూ రంగంలోకి దిగబోతున్నారు. ఈ నెల 30న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ ఉండగా.. ఈ నెల 31న జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ ఉంది. దీంతో ఆయా పార్టీల నేతలు బహిరంగ సభకు ఏర్పాటు చేస్తోన్నాయి. గతంలో మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేయగా.. ఈ సారి చండూరులో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో కేసీఆర్ పాల్గొననుండటంతో.. పార్టీల నేతలు ఏర్పాట్లు చేస్తోన్నారు. ఏకంగా లక్ష మందిని కేసీఆర్ బహిరంగ సభకు తరలించాలని ప్రయత్నాలు చేస్తోన్నారు. భారీగా జనసమీకరణ చేసి కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు కసరత్తులు చేస్తోన్నారు. బస్సుల ద్వారా భారీగా గ్రామాల నుంచి బహిరంగ కోసం ప్రజలను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు.

మునుగోడు ఉపఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఎవరూ చెప్పలేపోతున్నారు. ఈ క్రమంలో బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ నే గెలవబోతుందని, టీఆర్ఎస్ గెలవకపోతే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానంటూ చెప్పుకొచ్చారు. గురువాం నవీన్ పేట్ మండలంలోని నాలేశ్వర్, తుంగినిలో మన ఊరు-మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని షకీల్ ప్రారంభించారు. గ్రామంలోని పలు కాలనీల్లో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

మునుగోడులో టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందని, గెలవకపోతే తాను ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తానంటూ షకీల్ ప్రకటించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీఆర్ఎస్ వర్గాల్లో ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతోన్నాయి. ఎమ్మెల్యే షకీల్ వ్యాఖ్యల వెనుక వ్యూహాం ఏముందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. రెండు పార్టీలో పోటాపోటీగా ఉన్నాయి. దుబ్బాక ఉపఎన్నికల తరహా సీన్ మునుగోడులో రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరు గెలిచినా తక్కువ ఓట్ల మెజార్టీతో గెలుస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఎవరు గెలిచిన సమీప అభ్యర్ధిపై తక్కువ ఓట్ల శాతమే గ్యాప్ ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం వస్తున్న సర్వేల ప్రకారం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఓట్ల శాతం గ్యాప్ ఒకటి నుంచి రెండు శాతమే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రచారానికి ఇంకా 5 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఈ నెల 30న కేసీఆర్ సభ, 31న జేపీ నడ్డా సభ తర్వాత పరిణామాలు మారిపోతాయని చెబుతున్నారు. ఇంకా చివరిలో ధనప్రవాహాన్ని బట్టి ఓటర్లలో మార్పు వస్తుందని, డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్లే గెలిచే అవకాశముందని చెబుతున్నారు. దీంతో ఎవరు గెలుస్తారనేది ఎవరూ ఊహించలేకపోన్నారు.

అయితే బీజేపీ గెలిస్తే కేసీఆర్ ను మరింత ఇబ్బంది పెట్టే అవకాశముంది. దీంతో మునుగోడులో బీజేపీ గెలిస్తే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. మునుగోడులో గెలిచిన ఊపుతో బీజేపీకి వచ్చే ఏడాది జరిగే ఎన్నికల వరకు సమయం ఇస్తే మరింత బలపడే అవకాశముంటుంది. అందుకే మునుగోడులో బీజేపీ గెలిస్తే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశముందని అంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే షకీల్ చేసే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -