Shabeena: త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఎంగేజ్మెంట్ ఫోటోలు!

Shabeena: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం ద్వారా లేడీ కంటెస్టెంట్లు కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు ఈ కార్యక్రమంలో లేడీస్ గెటప్ కూడా మగవాళ్ళు వేసేవారు.అయితే రాను రాను ఈ కార్యక్రమంలో లేడీ కంటెస్టెంట్లను కూడా పరిచయం చేయడంతో ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో షబీనా ఒకరు.

ఈమె కెవ్వు కార్తీక్ టీం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఇకపోతే ఈ సొట్టబుగ్గల చిన్నది జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందే బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు టీవీ సీరియల్స్ లో నటించారు. మాటీవీలో ప్రసారమవుతున్న కస్తూరి, ఇంటింటి గృహలక్ష్మి వంటి సీరియల్స్ లో నటించిన నటించిన షబీనాకు సీరియల్స్ ద్వారా రానీ గుర్తింపు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా వచ్చిందని చెప్పాలి. ఇక ఈ కార్యక్రమాల ద్వారా కొన్ని రోజులపాటు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసిన ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.

షబీనా సోషల్ మీడియా వేదికగా తనకు నిశ్చితార్థం జరిగిందని నిశ్చితార్థపు ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఒక్కసారిగా సర్ప్రైజ్ చేశారు. మున్నా అనే వ్యక్తితో తాను నిశ్చితార్థం జరుపుకున్నానని తన నిశ్చితార్థపు ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తన నిశ్చితార్థం గత నెల 17వ తేదీ జరిగింది. ఇదే విషయాన్ని ఈమె తెలియజేస్తూ జూలై 17వ తేదీ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తన నిశ్చితార్థ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు ఇతర నటీనటులు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరుపుకున్న షబీనా త్వరలోనే పెళ్లి తేదీని కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇలా అతి త్వరలోనే ఈమె తన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -