Twitter: ఎలాన్‌ మాస్క్‌ తీరుతో ఎంత మంది రాజీనామా చేశారో తెలుసా?

Twitter: ప్రపంచ కుబేరుడు.. టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత కీల నిర్ణయాలతో దూకుడు చూపిస్తున్నారు. రోజుకొక నిర్ణయంతో అందరిని గందరగోళానికి గురి చేస్తున్నాడు. కఠిన నిర్ణయాలతో దూకుడు పెంచిన ఎలాన్‌ మస్క్‌.. ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నాడు. ఇప్పటికే వెరిఫైడ్‌ వినియోగదారులకు మాత్రమే నెలకు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించిన మస్క్‌ ఇప్పుడు ట్విట్టర్‌ యూజర్లందరికి ఛార్జ్‌ వసూలు చేయాలని భావిస్తున్నాడు. ఇందుకు సంబంధించి సంస్థ కీలక ఉద్యోగులతో మస్క్‌ చర్చించినట్లు తెలుస్తోంది. ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు చేజిక్కించుకున్న తర్వాత ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 

సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉద్యోగుల సంఖ్యను దాదాపు 50శాతానికి తగ్గించారు. వెరిఫైడ్‌ యూజర్లకు నెలకు 8 అమెరికన్‌ డాలర్లు వసూలు చేసేందుకు అడుగులు ముందుకు వేశారు. ఇప్పుడు అందరి నుంచి ఫీజు వసూలు చేయాలన్న మస్క్‌ నిర్ణయం.. ట్విటర్‌ యూజర్లందరిపైనా తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈక్రమంలో ట్విటర్‌ సంబంధించిన వేలాది మంది మూకుమ్మడిగా రాజీనామ చేయడంతో ట్విటర్‌కు సంబంధించిన ఆఫీసులన్నీ మూతబడనున్నట్లు వార్తాలు వస్తున్నాయి. అంతేకాక తాము ట్విటర్‌ 2.0లో పాలుపంచుకోలేమని మెయిల్స్‌ పంపుతున్నారు. ఇలా ఒకేసారి మూకుమ్మడి రాజీనామా చేస్తే సంస్థ నష్టాల్లో కూరుకుపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

ఎలాన్‌ మాస్క్‌ తీరుతో ట్విటర్‌ సంస్థ ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని ప్రముఖ టెక్నాలజీ జర్నలిస్ట్‌ జోపిషర్‌ పేర్కొన్నారు. ఇంతలో స్పందించిన ట్విటర్‌ సంస్థ ఫెడరల్‌ ట్రెడ్‌ కమిషన్‌కు విరుద్ధంగా ఉందని శుక్రవారం వేకువజామున 7 మంది సెనెటర్లు తన వినియోగదారుల గొప్యత ఒప్పందాన్ని ఉల్లంఘించిందా అనే అనుమానంతో విచారణ చేయాలని ఓ లేఖ రాసింది. ఇన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో మాస్క్‌ స్పందించి నన్ను రోజంతా తిట్టండి కాని.. దానికి మాత్రం 8 డాలర్లు ఖర్చువుతుందని ఓ ట్వీట్‌ చేయడం గమన్హరం. ఎవరెన్ని మాటలు ఆడిపోసినా కానీ మాస్క్‌ మాత్రం తన నిర్ణయంతో ఏ మాత్రం వెక్కి తగ్గడం లేదనే భావన కన్పిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -