Geethanjali: చనిపోయిన గీతాంజలిని సోషల్ మీడియా పోస్ట్ లతో మరీ చంపేస్తున్నారుగా.. ఏమైందంటే?

Geethanjali: మనదేశంలో ఏ విషయంలో స్వేచ్ఛ లేకపోయినా ఓటు విషయంలో ప్రతి ఒక్కరికి పూర్తి స్వేచ్ఛ కలిగి ఉంది ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు కావడంతో వారికి నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం కోసం ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటారు అయితే నాకు ఫలానా నాయకుడు అంటే ఇష్టం మేము ఆయనకే ఓటు వేసి గెలిపించుకుంటాము అంటూ ఒక సాధారణ గృహిని చెప్పినటువంటి మాటలు ఆమె నిండు ప్రాణాలను బలి ఉన్నాయి.

తెనాలికి చెందిన గీతాంజలి అనే 30 సంవత్సరాల మహిళ జగనన్న ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఇంటి పట్టా అందుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాకు జగనన్న ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ అందుతాయి. ఆయన పాలన నచ్చింది. ఈసారి కూడా ఓటు వేసి గెలిపించుకుంటాము అంటూ ఆమె సంతోషంతో చెప్పడంతో కొంతమంది ఆ ఆనందాన్ని భరించలేక ఆమె వ్యక్తిత్వం పై బురద చల్లుతూ తనని మానసికంగా కృంగదీసి ఆత్మహత్య చేసుకునేలా పాల్పడ్డారు.

ఇలా గీతాంజలి సోషల్ మీడియాలో తన గురించి వస్తున్నటువంటి నెగిటివ్ ట్రోల్స్ భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయారు .ఈ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ దృష్టికి వెళ్లడంతో ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఏకంగా 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు అలాగే పలువురు వైసిపి నాయకులు ఆమె ఇంటికి వెళ్లి తన భర్త పిల్లలను ఓదారుస్తున్నారు. ఇక ఈ విషయంపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తులు ప్రారంభించారు.

ఇలా ఈమె ఆత్మహత్యకు కారణమైనటువంటి వారిని శిక్షించాలంటూ సోషల్ మీడియాలో మరోసారి ఈమె గురించి చర్చలు జరుగుతున్నాయి..ఇలా గీతాంజలి చనిపోయిన సోషల్ మీడియా వేదికగా ఆమె గురించి చేసే పోస్టులు తనని మరింత చంపుతున్నాయని తెలుస్తున్నాయి. అయితే గతంలో వైయస్ వివేకానంద రెడ్డి అలాగే ఓ దళిత యువకుడిని కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఈ వైసీపీ నేతలు ఎవరు కూడా మాట్లాడలేదు కానీ గీతాంజలి విషయంలో ఇలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఎలక్షన్స్ దగ్గర పడటమేనని గీతాంజలి మరణంతో మరోసారి ఓటు బ్యాంకు సంపాదించుకోవడానికి వైసిపి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -