Paid Surveys: ఎన్నికల కోడ్ తర్వాత మాట మార్చిన పెయిడ్ సర్వేలు.. ఏకంగా అలా ప్లేట్ ఫిరాయించడంతో?

Paid Surveys: ఏపీలో రోజురోజుకు రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. పరిస్థితులు మారుతున్నా.. గాలి మాత్రం టీడీపీ, జనసేనకే అనుకూలంగా వీస్తుంది. నాలుగు నెలల క్రితం ఫైట్ టఫ్ గా ఉంటుందనినే అభిప్రాయాలు వెలువడ్డాయి. ఆ తర్వాత కూటమికి క్లియర్ మెజారిటీ వస్తుందని సర్వేలు తేల్చాయి. ఇప్పుడు వైసీపీ దారుణ ఓటమిని చూస్తుందని చెబుతున్నాయి. దీంతో.. నిన్న మొన్నటి వరకూ వైసీపీకి డబ్బా కొట్టిన సర్వే సంస్థలన్ని ఇప్పుుడు యూటర్న్ తీసుకుంటున్నాయి. గత 6 నెలలుగా సర్వేలన్నీ టీడీపీ, జనసేన కూటమికి అనుకూలంగానే వస్తున్నాయి. గత ఎన్నికల్లో 140 స్థానాలకు పైగా వైసీపీ గెలుస్తుందని ఆత్మసాక్షి సర్వే చెప్పింది. అప్పుడు ఆ సర్వేను అంతా తప్పుపట్టారు. కానీ… ఫలితాలు మాత్రం ఆత్మసాక్షి సర్వే ప్రతిబింబించేలా వచ్చాయి. అదే సర్వే నాలుగు నెలల క్రితం టీడీపీ, జనసేన కూటమి కలిసి పోటీ చేస్తే టీడీపీకి 95 సీట్లు, జనసేనకు 13 సీట్లు వస్తాయని తెలిపింది. వైసీపీ 60 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని అంచనా వేసింది.

ఇటీవల ఇండియా టుడే సర్వే కూడా టీడీపీ, జనసేన కూటమికే పట్టం కట్టింది. ఏపీలో ఎన్నికలపై ఇటీవల పయనీర్ పోల్ సర్వే ఒకటి బయటకు వచ్చింది. ఈసారి అధికార వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని తేల్చింది. వైసీపీ కేవలం 47 స్థానాలకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పింది. 24 నియోజకవర్గాల్లో నువ్వు-నేనా అన్న పోటీ ఉంటుందని.. మిగిలిన స్థానాల్లో టీడీపీ కూటమి గెలుపును ఖాయం చేసింది. 25 ఎంపీ స్థానాల్లో ప్రతిపక్ష కూటమి ఖాతాలో 18 సీట్లు పడతాయని పయనీర్ పోల్ సర్వే తేల్చింది. మరోవైపు ఇండియా టుడే సర్వే కూడా కూడా కూటమికే పట్టం కట్టింది. 17 ఎంపీలను టీడీపీ కూటమి సొంతం చేసుకుంటుందని తేల్చింది. దీంతో.. వైసీపీ పెయిడ్ సర్వే సంస్థలు కూడా స్వరం మార్చాయి. ఈ నెల మొదట్లో ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్ సర్వే వైసీపీకి పట్టం కట్టింది. వైసీపీకి పదిహేను ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పింది. ఈ సర్వేను జగన్ సొంత మీడియా, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే ఎన్నికల కోడ్ రాగానే ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ప్లేట్ తిప్పేసింది. మరోసారి చేసిన సర్వేలో వైసీపీకి ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయని చెప్పుకొచ్చింది. టీడీపీ కూటమికి 17 స్థానాలు వస్తాయని చెప్పింది. అయితే, ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే మాత్రమే కాదు.. ఆ మధ్య వైసీపీ 25 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని ప్రకటించింది. ప్రతిపక్ష కూటమి ఖాతాలో ఒకటి కూడా పడదని చెప్పింది. కానీ.. ఎన్నికల కోడ్ తర్వాత వైసీపీకి 25 నుంచి 17కి తగ్గించింది. దీంతో.. మరో 10 రోజులు పోతే.. ఇంకా తగ్గించేస్తుందని టీడీపీ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తుంది.

అయితే, ఈ పెయిడ్ సర్వే సంస్థలు కూడా వెనక్కి తగ్గడానికి ఓ కారణం ఉంది. ఎంత వైసీపీని ప్రమోట్ చేసినా.. ప్రజలు ఓడించడానికి రెడీ అయిపోయారని ఆ సంస్థలకు తెలుసు. కాబట్టి ఓడిపోయే పార్టీని ఎంత ప్రమోట్ చేసినా ప్రమోజనం లేదని ఆ సంస్థలు భావించాయి. ఇంకా వైసీపీ గెలుస్తుందని ప్రచారం చేస్తే సంస్థకు ఉన్న క్రెడిబిలిటీ పోతుందని భావించి యూటర్న్ తీసుకున్నాయి. జగన్ మాత్రం పార్టీని ప్రమోట్ చేయడానికి తెగ ఆరాటం పడుతున్నారు. గుట్టల కొద్ది పెయిడ్ సర్వేలను బయటకు రిలీజ్ చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో పెయిడ్ సర్వేలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమకు అనుకూలంగా సర్వేలను రిలీజ్ చేస్తే లైఫ్ టైం సెటిల్ మెంట్ చేస్తానని ప్రలోభాకలు గురి చేస్తున్నారు. మెజారిటీ సంస్థలు జగన్ ఆఫన్ కు నో చెబుతున్నా.. ఒకటో రెండో మాత్రం ఓకే చెప్పి వైసీపీకి భజన చేస్తున్నారు. కానీ, జెన్యూన్ సర్వేలు రిలీజ్ అయినపుడు ఆ ఫేక్ సర్వే సంస్థలు తడబడతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -