Blueticks: రాజకీయ, సినీ ప్రముఖులకు ట్విట్టర్ భారీ షాక్.. ఏం జరిగిందంటే?

Blueticks: మన దేశంలోనే పలువురు రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలకు ట్విట్టర్ గట్టి షాక్ ఇచ్చింది. సెలబ్రిటీలు తమ ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ కలిగి ఉన్నారు అయితే ట్విట్టర్ ఒక్కసారిగా వారికి షాక్ ఇస్తే వారి ఖాతాలకు బ్లూటిక్ తొలగించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మొదలుకొని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సమంత, షారుక్ ఖాన్, అలియా భట్, విరాట్ కోహ్లీ వంటి తదితర సెలబ్రిటీలకు ట్విట్టర్ బ్లూ ఖాతాను తొలగించింది.

ఇలా ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే ఇలా ట్విట్టర్ తమ అకౌంట్ నుంచి బ్లూ టిక్ తొలగించడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… ఎలాన్ మస్క్ కొనుగోలు చేయకముందు ఒకలా, కొనుగోలు చేసిన తర్వాత ఒకలా ఆ మైక్రోబ్లాగింగ్ సైట్లో నిబంధనలు ఉన్నాయి. ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయకముందు భారతీయ యూజర్లకు ఆ మైక్రోబ్లాగింగ్ సైట్ ఉచితంగా బ్లూ టిక్ అందించేది.

 

ఇక ఈయన కొనుగోలు చేసిన తర్వాత మైక్రో బ్లాగింగ్ సైట్ నుంచి ఉచితంగా బ్లూటూత్ అందించడం కుదరదని ముందుగానే హెచ్చరించారు. ఇలా బ్లూటిక్ కావాలి అనుకునేవారు డబ్బులు కట్టాల్సిందే. సబ్‌స్క్రైబ్ చేసుకోని వారి ఖాతాకు బ్లూటిక్ తొలగిస్తామని ఇటీవలే ట్విట్టర్ ప్రకటించింది.అయితే ట్విట్టర్ ఈ విషయాన్ని ముందుగా ప్రకటించిన చాలా మంది ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారు. అయితే చెప్పిన విధంగానే ట్విట్టర్ అనుకున్నంత పనిచేసే డబ్బు చెల్లించని వారికి బ్లూ టిక్ తొలగించింది.

 

మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న ప్రముఖులు ట్విట్టర్ చర్యతో షాక్ అవుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి ట్విట్టర్ నిబంధనలు మార్చి, మళ్లీ సైన్ అప్ చేసుకోవాలని ప్రకటించినప్పటికీ చాలామంది సైన్ అప్ చేసుకోకపోవడంతో ఇలా బ్లూటిక్ తొలగిపోయిందని తెలుస్తుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మహేష్ బాబు ఎన్టీఆర్ వంటి హీరోలు ముందుగానే అలర్ట్ కావడంతో వారికి బ్లూటిక్ అలాగే ఉందని తెలుస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Manifesto: జగన్ మేనిఫెస్టోపై జనాభిప్రాయం ఇదే.. బాబోయ్ జగన్ అంటున్న ఏపీ ప్రజలు!

YSRCP Manifesto: శనివారం రోజు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ ముందు వైసీపీ మేనిఫెస్టో...
- Advertisement -
- Advertisement -