Undavalli Arun Kumar: చంద్రబాబుకు మహోపకారం చేసిన ఉండవల్లి.. సీబీఐ ఎంట్రీ ఇస్తే జరగబోయేది ఇదేనా?

Undavalli Arun Kumar: ఇప్పటికే ఆధారాలు లేని కేసులు బనాయించి చంద్రబాబుని కటకటాల పాలు చేశాడు జగన్. అయితే పుండు మీద కారం చల్లినట్లుగా స్కిల్ డెవలప్మెంట్ స్కాం పై విచారణ జరపాలని పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. కేసు విచారణను సీబీఐ కి ఇవ్వాలని దాఖలు చేశారు.

కేసులో ఉన్న సంక్లిష్టత, హై ప్రొఫైల్ వ్యక్తులు ఇన్వాల్వ్ అయిన దృష్ట్యా ఈ కేసు విచారణను సీబీఐ కి అప్పగించాలని ఉండవల్లి తన పిటిషన్ లో కోరారు. మొత్తం 44 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ స్కాంపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. చంద్రబాబు నాయుడు, అచ్చెం నాయుడుతో పాటు సీబీఐ, ఈడి కేంద్ర ప్రభుత్వాలను ప్రతివాదులు గా పేర్కొన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఒకవైపు చంద్రబాబునాయుడు బెయిల్ పిటిషన్ పోలీస్ కస్టడీ పిటిషన్ జరుగుతూ ఉండగా..

ఉండవల్లి అరుణ్ కుమార్ రిట్ పిటిషన్ దాఖలు చేయడం చంద్రబాబు అభిమానులను, టీడీపీ శ్రేణులను ఉత్కంఠకు గురిచేస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయలేదని, కడిగిన ముత్యంలో ఆయన బయటకు వస్తారని తెదేపా నేతలు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి జరిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఎందుకు ఈ కేసు నమోదు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్ల తర్వాత కక్ష సాధింపుతోనే టీడీపీ అధినేత ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఉండవల్లి రిట్ పిటిషన్ దాఖలు చేసి చంద్రబాబు నాయుడుకి మహోపకారం చేశారని చెప్పాలి. ఈ విధంగా ఆయన కేసు ఏపీ సీఐడి నుంచి సీబీఐ చేతులలోకి వెళితే కేసులో ఉండే నిజా నిజాలు బయటికి తేలుతాయి అంటూ తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం వర్గం వారు. మరి ఉండవల్లి వేసిన పిటిషన్ ని హైకోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -