Undavalli Arun Kumar: అలా అయితే గెలుపు ఆ పార్టీదే.. ఏపీ ఎన్నికలపై ఉండవల్లి సంచలనం

Undavalli Arun Kumar: కాంగ్రెస్ మాజీ ఎంపీ, రాజమండ్రికి చెందిన సీనియర్ పొలిటీషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలుగు ప్రజలందరికీ సుపరిచితమే. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన రాజకీయ నేతగా ఆయనకు పేరుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండవల్లికి మంచి పేరు ఉంది. వైఎస్ ఫ్యామిలీతో అత్యంత దగ్గర సంబంధాలు ఉన్న ఉండవల్లికి సీఎం వైఎస్ జగన్ తో కూడా మంచి సాన్నిహిత్యమే ఉంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తూ ఉంటారు. ఎప్పుడో ఏదోక ప్రెస్ మీట్ పెడుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తూ ఉంటారు. ఉండవల్లికి రాజకీయ అనుభవం ఎక్కువ ఉండటం, సామాజిక, రాజకీయ అంశాలపై ఆయనకు ఎక్కువ సబ్జెక్ట్ ఉండటంతో ఆయన మాట్లాడే మాటలకు అత్యంత ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది.

సోషల్ మీడియాలో ఉండవల్లి మాట్లాడే మాటలు వైరల్ గా మారుతూ ఉంటాయి. యూట్యూబ్ లో ఆయన ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలకు భారీగా వ్యూస్ వస్తాయి. దీంతో ఉండవల్లి మాటలకు విలువ మరింత పెరిగింది. ఆయన మాట్లాడే మాటలను అందరూ ఆసక్తిగా ఉంటూ ఉంటారు. అయితే తాజాగా ఆయన ఏపీ రాజకీయాలపై సంచలన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి కూడా ఆయన విశ్లేషించారు. ఏపీలో జగన్ తో కలిసి వెళ్లాలని మోదీ అనుకుంటే జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు. దాని వల్ల ట్రయాంగిల్ పోటీ జరిగి అధికార వైసీపీకి ప్లస్ అవుతుందని ఉండవల్లి అంచనా వేశారు.

ఇక టీడీపీతో కలిసి నడవాలని మోదీ అనుకుంటే టీడీపీ-వైసీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని, ఏపీలో మహా ఘటబంధన్ తయారు అవుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. ఈ మూడు పార్టీలు కలిస్తే వైసీపీకి కష్టమేనని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఏపీలో జగన్ కు గ్రామాల్లో ఆదరణ ఉందని, కానీ అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ బాగా తగ్గిందని ఉండవల్లి స్పష్టం చేశారు. అర్బన్ లో వైసీపీ గ్రాఫ్ బాగా దెబ్బతిందని ఉండవల్లి విశ్లేషించారు.

గత ఎన్నికల్లో టీడీపీకి 40 శాతం ఓటింగ్ వచ్చిందని, అయితే ఈ సారి అది పెరిగే అవకాశముందని ఉండవల్లి అంచనా వేశారు. జనసేనకు గత ఎన్నికల్లో 6 శాతం ఓటింగ్ వచ్చిందని, ఈసారి అది 12 శాతానికి పెరగవచ్చని ఉండవల్లి అంచనా వేశారు. పొత్తులు కుదిరితే మాత్రం వైసీపీని ఓడించగలరని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. అయతే గ్రామీణ ఓటర్లకు వైసీపీ నచ్చి ఓటేస్తే ఆ పార్టీ మళ్లీ వస్తుందని, లేకపోతే ప్రభుత్వం మారుతుందని ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్బన్ ఓటింగ్ లో మాత్రం పది శాతం దాక మీడియా పాత్ర ఉండవచ్చని ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ కు సొంత మీడియా సాక్షి ఉందని, అలాగే యాంటీ మీడియా కూడా గట్టిగానే ఉందన్నారు. అయితే మోదీకి తెలంగాణ మీద ఉన్న శ్రద్ధ ఏపీ రాజకీయాలపై లేదన్నారు. ఏపీలో బీజేపీ బలంగా లేకపోవడం వల్ల మోదీ కూడా పట్టించుకోవడం లేదన్నారు.

ఎలా చూసినా బాలెన్స్ గా మీడియా ఉందని, దీంతో మీడియా రాతల వల్ల ఫలితాల్లో పెద్దగా మార్పులు ఉండవని ఉండవల్లి అంచనా వేశారు. వచ్చే ఎన్నికల ఫలితాలపై ఉండవల్లి అంచనాలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన జోస్యం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగామారింది. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -