Undavalli Sridevi: వైరల్ అవుతున్న ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు!

Undavalli Sridevi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారాయి.ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారని నిర్ధారించుకున్నటువంటి అధికార పార్టీ ఆ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇక ఆ నలుగురిలో మహిళ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా ఉండటం గమనార్హం. ఇలా ఈమె కూడా క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారని నిర్ధారించుకున్నటువంటి ప్రభుత్వం ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.

 

ఈ సందర్భంగా పార్టీ ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్లినటువంటి ఉండవల్లి శ్రీదేవి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఈమె జగన్ సర్కారుపై ఆరోపణలు చేశారు. తాను క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డానని ఎలాంటి ఆధారాలు లేకుండా తనని సస్పెండ్ చేశారని ఈమె ఆవేదన చెందారు. ఇక ఏపీలో ప్రస్తుతం వైసీపీ గుండాల పరిపాలన సాగుతుందని, ఏపీలో తనకు ప్రాణహాని ఉందంటూ ఈమె షాకింగ్ విషయాలను వెల్లడించారు.

ఇక పార్టీ తనని సస్పెండ్ చేయడం గురించి మాట్లాడుతూ జగన్ గురించి కూడా కొన్ని విషయాలను తెలియజేశారు జగన్ గారికి చెవులు మాత్రమే పనిచేస్తాయని ఆయన పక్క వారు చెప్పినదే నమ్ముతారు తప్ప కళ్ళతో ఏదీ చూడరంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటలను విన్న జగన్ తనని పిచ్చికుక్కను చేసి రోడ్డుపైకి పడేసారు అంటూ ఆరోపణలు చేశారు.

 

ఇక తనని పార్టీ సస్పెండ్ చేయడంతో ఈమె అమరావతికి మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. తాను రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా అప్పట్లో ప్రజలకు అమరావతి రాజధాని అని మాట ఇచ్చాను కానీ మూడు రాజధానులను ప్రకటించినప్పుడు అక్కడ ప్రజలకు నేను ఎలా మొహం చూపించగలరని బాధపడ్డానని ఈమె తెలిపారు. అందుకే ఇప్పుడు తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అమరావతి రైతులకు మద్దతు తెలుపుతానని ఈమె తెలియజేశారు. ఇలా పార్టీ తనని సస్పెండ్ చేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu-CM Jagan: చంద్రబాబు పని అయిపోయిందా.. జగన్ ను తక్కువగా చేసి తప్పు చేశారా?

Chandrababu-CM Jagan: ఏపీ సీఎం జగన్ మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల మధ్య పచ్చ గడ్డి వేస్తే కూడా భగ్గు మంటుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎప్పుడు విమర్శలు గుప్పిస్తూ...
- Advertisement -
- Advertisement -