TDP: టీడీపీలో సీట్ల కోసం ఊహించని స్థాయిలో పోటీ.. ఏం జరిగిందంటే?

TDP: టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా త్వరలో విడుదల చేస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది. దీంతో చంద్రబాబు నాయుడు నివాసానికి టికెట్ల కోసం టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై నారా లోకేష్ కసరత్తు చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో సీట్లు సంపాదించడం కోసం ఒకే కుటుంబం నుంచి రక్తసంబంధికులు పోటీపడుతున్నారు.

 

తల్లి కుమారులు, తండ్రి కూతుర్లు అన్నదమ్ములు కూడా తెలుగుదేశం నుంచి టిక్కట్లు ఆశించి చంద్రబాబుని ఇరకాటంలో పెట్టేస్తున్నారు. చివరకు ఇది చంద్రబాబుకు మొహమాటలా చిక్కులు కూడా తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా పరిటాల కుటుంబం నుంచి ఈ రకమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు చంద్రబాబు నాయుడు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం సహా ధర్మవరం నియోజకవర్గాన్ని పరిటాల కుటుంబం ఆశిస్తోంది.

పరిటాల రవి వారసుడిగా 2019 ఎన్నికల సమయంలో తెరమీదకు వచ్చిన పరిటాల శ్రీరామ్ మరొకసారి తన అదృష్టం పరిశీలించుకునేందుకు రెడీ అయ్యారు. అలాగే పరిటాల శ్రీరామ్ తల్లి, పరిటాల రవి సతీమణి అయిన పరిటాల సునీత కూడా ఈసారి పోటీకి సై అంటున్నారు. ఈ ఒక్కసారికి ఛాన్స్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు తాను కచ్చితంగా తప్పుకుంటానని ఈ ఒక్కసారికి మాత్రం అవకాశం ఇవ్వాలని ఆమె చంద్రబాబుని బ్రతిమాలుకుంటున్నారు.

 

ఇక పరిటాల శ్రీరామ్ అయితే ఈసారి ఎన్నికలలో కచ్చితంగా గెలిచి తీరతానని కాబట్టి ధర్మవరం టిక్కెట్ను తనకు ఇవ్వాలని రాప్తాడు టిక్కెట్టు తన మాతృమూర్తికి కేటాయించాలని పట్టుబడుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ రెండు నియోజకవర్గాలలో ఏదో ఒక చోటు నుంచే పోటీ చేయమని చెప్తున్నప్పటికీ తల్లి కుమారులు మాత్రం రెండు నియోజకవర్గాల కోసం పోటీ పడుతున్నారు. 2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తే విజయం తథ్యమని అభ్యర్థులు భావిస్తున్నారు. అందువల్ల ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు, మూడు టికెట్లు ఆశించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అయితే టీడీపీలో టికెట్ల కోసం తీవ్రస్థాయిలో పోటీ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -