Unstoppable 2: అన్‌స్టాపబుల్ సీజన్2 ఫెయిల్ అవ్వడానికి కారణాలివే!

Unstoppable 2: నందమూరి నటసింహం బాలయ్య బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఫస్ట్ సీజన్ ముగించుకుని సీజన్-2 కూడా స్టార్ట్ చేసింది. మొదటి సీజన్‌కు ఊహించని విధంగా సక్సెస్ అందుకుంది. అన్ని టాక్ షోలను వెనక్కి నెట్టి.. నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇందులో హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలయ్య.. తన చిలిపి చేష్టలు, అల్లరి, కామెడీ టైమింగ్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. షోలో గెస్టులుగా వచ్చే సెలబ్రిటీలతో చిలిపి ప్రశ్నలు అడగటం, వారి పర్సనల్ విషయాలు ప్రేక్షకులకు తెలిసేలా చేయడం, అప్పుడప్పుడు ఫన్నీగా ఆటలాడుకోవడం షో స్పెషాలిటీ. అలా అన్‌స్టాపబుల్ షో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకెళ్తోంది.

 

 

ఈ షోకు టాప్ హీరోలంతా వచ్చి వెళ్లారు. షోలో గెస్టులుగా ఎవరు వస్తారు? వారితో బాలయ్య ఎలా ముచ్చటిస్తాడు? అనే సస్పెన్స్ తో ప్రేక్షకులను వెయిట్ చేయించగలుగుతున్నారు. మిలియన్స్ లో వీవ్స్ సంపాదించుకుంటూ అందరినీ సందడి చేస్తోంది. ఫస్ట్ సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో.. సీజన్-2పై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఇప్పటికే సీజన్-2లో నాలుగు ఎపిసోడ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. కానీ ఈ ఎపిసోడ్లు మాత్రం ప్రేక్షకులు అంతగా ఆకట్టుకోవడం లేదనే చెప్పుకోవచ్చు. దానికి కారణం పొలిటికల్ టచ్ ఇవ్వడమే కారణం అంటున్నారు. పొలిటికల్ లీడర్లు గెస్టులుగా రావడం వల్లే ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దాంతో సీజన్-2 అంతగా క్లిక్ అవ్వడం లేదు. షో యాజమాన్యం కూడా ఎపిసోడ్ ఎపిసోడ్‌కు గ్యాప్ ఇచ్చినా.. మంచి వీవ్స్ రావడం లేదు. ఫస్ట్ ఎపిసోడ్‌లో చంద్రబాబు, నారాలోకేశ్‌ గెస్టులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్‌ మంచి క్రేజ్‌నే అందుకుంది. ఆ తర్వాత రెండు ఎపిసోడ్లు కుర్ర హీరోలతో మంచి హైప్‌ను పెంచాయి. ఆ తర్వాత రిలీజ్ అయిన ఎపిసోడ్‌లో పొలిటికల్ లీడర్లను తీసుకొచ్చారు. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. పొలిటికల్ లీడర్లతో బాలయ్య అంతగా ఓపెన్ అవ్వడం లేదనే పుకార్లు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -