Uttar Pradesh: అన్నా చెల్లిలికి పెళ్లి.. 3 గంటల్లోపే..

Uttar Pradesh: నేటి సమాజంలో కొందరు చేస్తున్న తప్పిదాలతో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. తెలిసి చేస్తారో.. తెలియక చేస్తారో కానీ.. ఎలా చేసినా రెండు కుటుంబాలను తల దించుకునేలా చేస్తున్నారు కొందరు యువతీ, యువకులు.తెలిసీ తెలియని వయస్సులో కలిగిన ఆకర్షణ ఓ అబ్బాయి, అమ్మాయి జీవితాలను నాశనం చేసి సమాజంలో గౌరవం లేకుండా చేసుకున్నారు. సంధాలను మరిచిన ఆ యువతి, యువకుడు ప్రేమలో పడ్డారు. అంతటితో ఆగకుండా అప్పుడప్పుడు శారీరకంగా కూడా కలిశారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల కారణంగా సదరు యువతి ప్రాణాలు కోల్పోగా యువకుడు కటకటాల పాలయ్యాలైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియా ముందు వెల్లడించారు.

ఉత్తర ప్రదేశ్, రామ్‌పూర్‌ జిల్లాలోని గుహ్లియా ఏరియాకు చెందిన రవి అనే యువకుడు, గడైయా పజాబాపోలీస్ట్‌ స్టేషన్‌ పరిధికి చెందిన రాజేశ్వరి అనే యువతి ఒకరికొకరు ప్రేమించుకున్నారు. అయితే, వీరిద్దరూ వరసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. ఈ విషయం తెలిసి కూడా తమ ప్రేమను కొనసాగించారు. ఇలా ప్రేమలో పడి మూడేళ్లు గడిచిపోయాయి.

ఈ క్రమంలో ఇరువురు గుట్టుచప్పుడు కాకుండా అప్పుడప్పుడు శారీరకంగా కూడా కలిసేవారు. ఈ క్రమంలో రాజేశ్వరి గర్భవతి కావడతో ఈ విషయాన్ని రాజేశ్వరి, రవితో చెప్పింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పింది. రవి అప్పుడు ఇప్పుడంటూ మట దాటవేసుకుంటూ వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ రాజేశ్వరి రవి దగ్గరకి వెళ్లి పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిలదీసింది. ఇందుకు రవి ఒప్పుకోలేదు.

అయితే.. రాజేశ్వరి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఎనిమిది నెలల తర్వాత ఆమె తల్లికి ఈ విషయం తెలిసింది. ఆమె కూతురిని నిలదీయగా జరిగినదంతా తల్లికి వివరించింది.ఆ తర్వాత ఇద్దరి కుటుంబ సభ్యులు ఈ విషయంపై చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చారు. ఇద్దరిరితో మాట్లాడి పెళ్లి జరిపించారు. అంతా పెళ్లి సందడిలో ఉండగా మూడు గంటలైన తర్వాత రాజేశ్వరి చనిపోయింది. తమ కూతురు చనిపోవటానికి భర్త, మామతో పాటు మరో వ్యక్తి కారణమంటూ రాజేశ్వరి తండ్రి సత్యపాల్‌ గంగవార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -