Uttar Pradesh: కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన.. చిన్న తప్పుకే కొట్టి చివరికి?

Uttar Pradesh: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు కొన్ని రకాల సంఘటనలు చూస్తే సమాజంలో ఇలాంటి క్రూరమైన దారుణమైన మనుషులు కూడా ఉంటారా అన్న అనుమానం వస్తూ ఉంటుంది. మనుషులు మానవత్వాన్ని మరిచి కొట్టి చంపిన ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దారుణంగా నడిరోడ్డుపైనే హత్యలు చేయడం పొడిచి చంపడం లాంటివి ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.

ఒక వ్యక్తి చిన్న తప్పు చేయడంతో అతనిని దారుణంగా కట్టేసి కొట్టి చంపేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో చోటు చేసుకుంది. బంకిం సూరి అనే రవాణా వ్యాపారి వద్ద శివమ్ జోహ్రీ అనే 32 ఏళ్ళ వ్యక్తి మేనేజర్ గా పని చేస్తున్నాడు. అయితే బంకిం దొంగతనం చేశాడు అన్న ఒక కారణంతో అతన్ని ఒక చిన్న పోల్ కి కట్టేసి ఇనుపరాడితో కొట్టి కొట్టి చివరికి అతను చనిపోయాడు. తాను దొంగతనం చేయలేదు అని చెప్పినా కూడా వినిపించుకోకుండా అతన్ని దారుణంగా కొడుతూనే ఉన్నారు. యజమానే దగ్గరుండి శివమ్ ను రాడ్డుతో కొట్టించాడు. యజమాని ఆదేశించడంతో ఆ వ్యక్తిని చచ్చేలా కొట్టారు.

ఆ తర్వాత తమ చేతులకు మట్టి అంటకుండా శివమ్ మృతదేహాన్ని మంగళవారం రాత్రి మెడికల్ కళాశాల, ఆసుపత్రి దగ్గర పడేసి వెళ్లిపోయారు. అయితే శివమ్ కుటుంబ సభ్యులు అతను కరెంట్ షాక్ వల్ల చనిపోయాడని చెప్పారని పోలీసులు అన్నారు. మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత కరెంట్ షాక్ తో మరణించలేదని అతని ఒంటి మీద గాయాలు ఉండడంతో హత్య చేసి ఉండవచ్చునని అనుమానంతో దర్యాప్తు ప్రారంభించారు. తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బంకిం సూరి దగ్గర శివమ్ ఏడేళ్లుగా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కన్నయ్య హోజరీ సంస్థ నుంచి ఒక పేపర్ ప్యాకేజీ మిస్ అయిన కారణంగా శివమ్ మీద దొంగతనం నేరం మోపి స్తంభానికి కట్టేసి రాడ్డుతో కొట్టారని పోలీసులు తెలిపారు. యజమాని ఆదేశాల మేరకు ఏడుగురు సిబ్బంది కలిసి శివమ్ ను చంపారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో కన్నయ్య హోజరీ యజమాని బంకిం సూరి, నీరజ్ గుప్త సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ హత్య కోసం కారుని ఉపయోగించి ఉండవచ్చునన్న ఉద్దేశంతో కన్నయ్య హోజరీ ప్రాంగణంలో ఉన్న కారును పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -