Ranga Ranga Vaibhavanga: రంగ రంగ వైభ‌వంగా ట్రైలర్.. కేతిక, వైష్ణవ్‌ల కెమిస్ట్రీ అదుర్స్

Ranga Ranga Vaibhavanga: ఉప్పెన సినిమాతో పంజా వైష్ణ‌వ్ తేజ్ (Vaisshnav Tej) నిజంగానే కలెక్షన్ల ఉప్పెన క్రియేట్ చేశాడు. మొదటి చిత్రంతోనే వంద కోట్ల క్లబ్బులోకి చేరాడు వైష్ణవ్. ఇప్పుడు వైష్ణవ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం రంగ రంగ వైభ‌వంగా (Ranga Ranga Vaibhavanga). అర్జున్ రెడ్డి ఫేం (త‌మిళ వెర్ష‌న్‌) గిరీశయ్య (Gireesaaya) ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ ట్రైల‌ర్‌ను కాసేపటి క్రితం విడుదల చేశారు.

‘నువ్వొచ్చి నాతో మాట్లాడేంత వ‌ర‌కు నేను నీతో మాట్లాడ‌ను..గుర్తు పెట్టుకో’ అని హీరోయిన్ (చైల్డ్ ఆర్టిస్ట్).. ‘నువ్వొచ్చి నాతో మాట్లాడేంత వ‌ర‌కు నేనూ నీతో మాట్లాడ‌ను గుర్తు పెట్టుకో.. ’ హీరో (చైల్డ్ ఆర్టిస్ట్) లాగి పెట్టుకుని కొట్టుకోవడం, ఈ డైలాగ్స్‌తో ట్రైలర్ మొదలవుతుంది.అంటే ఈచిత్రంలో హీరోహీరోయిన్ల మధ్య మౌనమే ప్రేమగా మారుతుందన్న మాట.

ఆ ఇద్దరూ ఎప్పుడు మాట్లాడుకుంటారు.. ఆ మూమెంట్ ఏంటి.. ఎలా ఉంటుంది.. అసలు ఈ కథలో మెయిన్ పాయింట్ ఏంటన్నది తెలియకుండా ఎంతో ఇంట్రెస్ట్‌గా ట్రైలర్‌ను కట్ చేసేశారు. ల‌వ్‌, ఎమోష‌న్‌, సీరియ‌స్, ఫ‌న్ ఎలిమెంట్స్‌తో సాగుతూ క్యూరియాసిటీని క‌లిగిస్తోంది. సిల్వ‌ర్ స్క్రీన్‌పై కేతిక శ‌ర్మ‌, వైష్ణ‌వ్ తేజ్ కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయింద‌ని ట్రైల‌ర్‌తో అర్థ‌మ‌వుతోంది.

ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌స్తోంది. మొత్తానికి ట్రైలర్‌తో అంచనాలు పెంచేశారు. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ సెప్టెంబర్ 2న రాబోతోంది.

Related Articles

ట్రేండింగ్

Nandamuri Balakrishna: మాటల తూటాలు పేల్చిన బాలయ్య.. కర్నూలులో పంచ్ డైలాగ్స్ తో రేంజ్ పెంచాడుగా!

Nandamuri Balakrishna: టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపురం ఎంపీ నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈ యాత్ర కూటమి పార్టీల తరఫున చేస్తున్నారు. యాత్రలో...
- Advertisement -
- Advertisement -