Ranga Ranga Vaibhavanga Review: రంగ రంగ వైభవంగా మూవీ రివ్యూ

Ranga Ranga Vaibhavanga Review: రంగ రంగ వైభవంగా అనే చిత్రంతో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు నేడు. ఈ మూవీతో ఈ జంట ఏ మేరకు మెప్పించింది.. గిరీశయ్యకు దర్శకుడిగా ఏ మేరకు మార్కులు పడ్డాయో చూడాలి. కొత్త దనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు ఎక్కిందో ఓ సారి చూద్దాం.

కథ: రిషి (వైష్ణవ్ తేజ్) రాధ (కేతిక శర్మ)లు ఇద్దరూ బాల్య స్నేహితులే. రెండు కుటుంబాలే కలిసే ఉంటాయి. అయితే రిషి, రాధలు చిన్నప్పటి నుంచే ఓ గొడవ వల్ల మాట్లాడుకోవడం మానేస్తారు. పెరిగి పెద్దయ్యాక కూడా పంతంతోనే ఉంటారు. వారి మౌనం ఎప్పుడు వీడింది? వీరికి ఎదురైన సమస్యలు ఏంటి? ఈ కుటుంబానికి వచ్చిన చిక్కులు ఏంటి? చివరకు రిషి రాధ ఏమయ్యారు? ఈ సినిమాలో సంఘర్షణ ఏంటన్నది కథ.

నటీనటుల పనితీరు: రంగ రంగ వైభవంగా సినిమాలో వైష్ణవ్ తేజ్ నటన అద్భుతంగా అనిపిస్తుంది. ఎంతో ఓపెన్ అయి ఫ్రీగా నటించేశాడు వైష్ణవ్. ఉప్పెన, కొండపొలంలో కాస్త సీరియస్ పాత్ర అయినా కూడా ఇందులో మాత్రం ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కారెక్టర్. రిషి పాత్రలో యాటిట్యూడ్, మ్యానరిజం, యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా అన్నింట్లోనూ మెప్పించాడు. ఇక రాధ పాత్రలో కేతిక అందంగా కనిపించడమే కాదు అంతకు మించి చక్కగా నటించేసింది. మిగిలిన పాత్రల్లో నరేష్, సుబ్బరాజు, ప్రభు, కమెడియన్స్ ఇలా అందరూ తమ పరధి మేరకు నటించారు.

విశ్లేషణ: ఇప్పుడుంతా కూడా కేజీయఫ్, విక్రమ్, పుష్పల కాలం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఓ పాత కాలపు ఫార్మూలాను తీసుకొచ్చి సినిమా చేయడం అంటే సాహసమే. ప్రేమ, కుటుంబం అనే కాన్సెప్ట్‌తో ఇది వరకు కొన్ని వేల, లక్షల సినిమాలు వచ్చి ఉంటాయి. అవి కనెక్ట్ అయితే మాత్రం కాసుల వర్షం కురిపిస్తాయి. రంగ రంగ వైభవంగా సినిమాలో అది జరుగుతుందనే ఆశలు లేనట్టు కనిపిస్తోంది. రొటీన్ కథకు మరింత రొటీన్ కథనాన్ని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు అనిపిస్తోంది,

తెరపై ఎక్కడా కొత్త సినిమాను గానీ, కొత్త సీన్లు చూస్తున్నట్టు గానీ అనిపించదు. ఎప్పుడో పాత కాలపు ఫార్మూలా, అరిగిపోయిన సీడీని వేసుకుని చూసుకున్నట్టు ఉంటుంది. కాకపోతే లీడ్ పెయిర్ మాత్రం ఎంతో ఫ్రెష్‌గా అనిపిస్తుంది. కొంత కామెడీ ట్రాక్ వర్కవుట్ అయినట్టు కనిపిస్తుంది. మిగతాదంతా కూడా అవుట్ డేటెడ్‌లా ఉంటుంది. ఇందులో సంఘర్షణ గానీ ఎమోషన్ గానీ ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వలేదని కూడా అనిపిస్తుంది.

ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కలిసి వచ్చాయి. శ్యాం దత్ ఫోటో గ్రఫీ, దేవీ శ్రీ ప్రసాద్ పాటలు పర్వాలేదనిపిస్తాయి. కొన్ని పాటలు బాగానే అనిపిస్తాయి. అక్కడక్కడా బీజీఎం కూడా వర్కవుట్ అయింది. మొత్తానికి సాంకేతికంగా ఈ చిత్రం పర్వాలేదనిపిస్తుంది. అయితే మాటలు అక్కడక్కడా ఆకట్టుకుంటాయి.

ప్లస్ పాయింట్స్…

వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ
కొన్ని పాటలు
ఫోటోగ్రపీ

మైనస్ పాయింట్…

రొటీన్ కథ, కథనాలు

రేటింగ్ 2.5

Related Articles

ట్రేండింగ్

CM Jagan: షర్మిల నెత్తిన పాలు పోస్తున్న వైఎస్ జగన్.. ఎంత విమర్శలు చేస్తే అంత మేలా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా పులివెందులలో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సభలో భాగంగా వైఎస్ వారసులు ఎవరో తేల్చుకోవాలంటూ...
- Advertisement -
- Advertisement -