Vanga Geetha: వైసీపీ వంగా గీతకు ప్రజల్లో తిరస్కారం వెనుక అసలు లెక్కలివేనా.. ఏం జరిగిందంటే?

Vanga Geetha: ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అందరూ చూపు పిఠాపురం వైపే ఉంది పిఠాపురంలో కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు అయితే పవన్ కళ్యాణ్ కు పోటీగా ఈ నియోజకవర్గంలో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వంగా గీతాను ఎన్నికల బరిలోకి దింపిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా పిఠాపురంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మధ్య పోటీ ఏర్పడింది. దీంతో ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి అయితే పలు సర్వేల ప్రకారం పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పీఠం దక్కేలా ఉంది. ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో లక్ష మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెబుతున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టకముందే పవన్ కళ్యాణ్ గెలుపును కాయం చేశారు పిఠాపురం వాసులు.

మరోవైపు వంగా గీత ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం లోని పిఠాపురం ఉంది అయితే ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ఈమె గెలుపుకు పిఠాపురంలో కష్టతరంగ మారడానికి కారణమేంటని విషయానికి వస్తే వీరు ఎక్కడ అభివృద్ధి చేయకపోవడమే కారణమని చెప్పాలి.

ఓట్లు అడగడం కోసం పిఠాపురంలో పర్యటిస్తున్నటువంటి వంగా గీతకు ప్రజల నుంచి పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. ఇన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉండి పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని రోడ్లు వేయలేదు నీటి సమస్య తీర్చలేదు అంటూ ప్రజలు మొఖం మీద ఏకవచనంతో అడిగి పారేస్తున్నారు. దీంతో వంగా గీత కూడా ఈ నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయా అని మనసులో అనుకుంటున్నప్పటికీ బయటకు మాత్రం తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎంతోమంది మంత్రులను కూడా ఇన్చార్జిలుగా వ్యవహరించారు. అయితే జగన్ ఎన్ని వ్యూహాలు రచించిన ఈసారి పవన్ విజయాన్ని మాత్రం ఆపలేరని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -