Vani Bhojan: ఎక్స్ పోజింగ్ చేయడంలో తప్పేముంది. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

Vani Bhojan: సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల లోకం. అదోక గ్లామర్ ప్రపంచం. గ్లామర్ ఉంటేనే సినిమాల్లో అవకాశాలు వస్తాయి. హీరోయిన్స్ కు నటన కంటే అందం ముఖ్యం. గ్లామర్ చూపిస్తూనే సినిమా అవకాశాలు వస్తాయి. గ్లామర్ షో చేయకుండా సినిమా అవకాశాలు కొట్టేసే హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉంటారు. సాయిపల్లవి లాంటి కొంతమంది హీరోయిన్ గ్లామర్ షో, ఎక్స్ పోజింగ్ లాంటివి చేయకుండానే తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బోల్డ్ నెస్ ను పక్కన పెట్టి నటనతోనే సినిమాలు అవకాశాలు దక్కించుకునే సాయిపల్లవి లాంటి హీరోయిన్లు ఇప్పుడు చాలా తక్కువమందే ఉన్నారు.

ఎక్కకుమంది హీరోయిన్లు గ్లామర్ షో, ఎక్స్ పోజింగ్ లు చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టేవాళ్లే. తమ గ్లామరింగ్ తో, బోల్డ్ నెస్ తో సినిమా అవకాశాలు దక్కించుకునే హీరోయిన్లే ఎక్కువమంది ఉన్నారు. సినిమా అవకాశాలు దక్కకపోతే గ్లామర్ షో పెంచేసి బికినీ, హాట్ హాట్ ఫొటోషూట్లతో హీరోయిన్లు రెచ్చిపోతూ ఉంటారు. తమ అందాలను ఆరబోస్తూ సినిమా అవకాశాల కోసం ఏది పడితే అది చేస్తూ ఉంటారు. అయితే గ్లామర్ హీరోయిన్స్ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండరు. మూడు, నాలుగు సినిమాలు చేసి ఆ తర్వాత అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు.

తాజాగా గ్లామర్ షోపై హాట్ బ్యూటీ వాణి భోజన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సినిమా అవకాశాల కోసం గ్లామర్ షోలో చేయడంలో తప్పేముందని ఈ అమ్మడు ఓపెన్ గా చెప్పేసింది. కాలానికి తగ్గట్లు ఆలోచనలు మారుతున్నాయని, ఈ మధ్య చీర కట్టినా గ్లామరస్ గా ఉన్నావని అంటున్నారని వాణిభోజన్ తెలిపింది. 16 ఏళ్ల వయస్సులో ప్రేమలో పడ్డానని, అది వెంటనే బ్రేకప అయిపోయిందని లవ్ విషయాన్ని బయపెట్టింది. అప్పటి ప్రేమ ఎక్కువకాలం నిలబడలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా వాణి భోజన్ నటిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -